శ్రీలంక జట్టుకు పెద్ద షాక్ తగిలింది. లంక జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ధనుష్క గుణతిలక ఓ మహిళ చేసిన రేప్ ఆరోపణల కారణంగా సస్పెండ్‌కు గురైయ్యాడు. గుణతిలక కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తన నియమావళి)ను అతిక్రమించాడని టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన బోర్డు.. ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్న బోర్డు అధికారులు ఎంతకాలం సస్పెన్షన్ కొనసాగిస్తామనే విషయం మాత్రం వెల్లడించలేదు. కాగా, గుణతిలక బస చేసిన హోటల్ గదిలోకి అతడి స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళలను తీసుకొచ్చాడు.

విదేశీ యువతిపై ఫ్రెండ్ అత్యాచారం... స్టార్ క్రికెటర్‌పై సస్పన్షన్ వేటు

అందులో ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలున్నాయి. గుణతిలక స్నేహితుడు తనపై అత్యాచారం చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక బోర్డు ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడని తేలడంతో గుణతిలకను సస్పెండ్ చేసింది. 

క్రికెటర్ గదిలో అత్యాచారం.. ఓపెనర్‌పై వేటు

విచారణ పూర్తయ్యే వరకు రెండో టెస్టు మ్యాచ్ ఫీజును నిలిపేయాలని బోర్డు నిర్ణయించింది. మరోవైపు గుణతిలక గతంలో పలుమార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు.. ప్రాక్టీస్ సెషన్‌ను ఎగ్గొట్టడం.. రాత్రి సమయాల్లో పార్టీలకు ఎక్కువ సమయం కేటాయించడం వంటి ఆరోపణలతో మ్యాచ్‌ల నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో సైతం కోత విధించారు.  ప్రస్తుతం నార్వే పర్యాటకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: