మహారాష్ట్ర రాజకీయాల్లో  సూపర్ ట్విస్టు చోటు చేసుకుంది. బిజెపి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయటం అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్సీపిలో ఏర్పడిన చీలక వల్ల ఫడ్నవీస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు.

 

శుక్రవారం రాత్రికి మూడు పార్టీల కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ ఒప్పందాలు జరిగాయి. అయితే హఠాత్తుగా ఎన్సీపిలో చీలకి వచ్చింది. 54 మంది ఎంఎల్ఏలున్న ఎన్సీపి నుండి 22 మంది ఎంఎల్ఏలు చీలిపోయారు. ఈ చీలకకు ప్రధాన కారణం అజిత్ పవార్ కావటం మరింత సంచలనంగా మారింది. పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడే అజిత్ పవార్.

 

పార్టీలో శరద్ పవార్ తర్వాత స్ధానం అజిత్ దే. మొత్తం పార్టీలో అజిత్ చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. అలాంటిది ఒకవైపు  శరద్ పవార్ శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కూడా రెడీ అవుతుంటే మరోవైపు అజిత్ నేతృత్వంలో పార్టీ చీలిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఎన్సీపిలో చీలికను ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే శివసేనతో ఇన్నిరోజులు జరుగుతున్న చర్చల్లో పార్టీ తరపున శరద్ పవార్ తో పాటు అజిత్ కూడా పాల్గొంటున్నారు. మూడు పార్టీల కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేయలనే నిర్ణయంలో అజిత్ కూడా భాగస్వామే. అలాంటిది రాత్రికి రాత్రి అజిత్ తన మద్దతుదారులతో కలిసి ఒక్కసారిగా బిజెపితో కలిసిపోవటం మిగిలిన అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.

 

అలాంటిది మేనల్లుడే తనపై తిరుగుబాటు చేస్తాడని శరద్ ఊహించలేదా ? లేకపోతే శరద్ కు తెలిసే అంతా జరుగుతోందా ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. శరద్ మహారాష్ట్రంలోని తిరుగులేని నేతల్లో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది పార్టీలోనే చీలిక రావటం దాంతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయటం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: