తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ....పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేసిన సంగ‌తి తెలిసిందే.వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. దీంతోపాటుగా ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే, తెలంగాణ‌లో అధికార పార్టీకి చెందిన ఎంపీల‌పై తెలంగాణకు చెందిన‌ బీజేపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, దర్మపురి అర్వింద్ విరుచుకుప‌డ్డారు. ఈ ముగ్గురు ఎంపీలు సంయుక్తంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

దిశకు కుటుంబానికి స‌రైన సంబంధాలు లేదు...టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న కామెంట్‌

 

టీఆర్ఎస్ ఎంపీలు ఉదయం పార్లమెంటులో డ్రామాలు చేశారని బీజేపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, దర్మపురి అర్వింద్ ఆరోపించారు. ``రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులను దుర్వినియోగం వ‌ల్ల రాష్ట్రం దాదాపు దివాళా తీసిన పరిస్థితికి చేరింది. బడ్జెట్ నిర్వహణలో భారీ అవకతవకలు, భారీ స్థాయిలో అవినీతి, నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాష్ట్రంలోని ఆర్థిక గందరగోళానికి ప్రధాన కారణాలు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో  కేంద్ర ప్రభుత్వం నుండి 28,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రస్తవిస్తూ , నీటిపారుదల ప్రాజెక్టు కోసం 20,000 కోట్ల నీతి అయోగ్ సిఫారసులను, మిషన్ కాకతియ కోసం మరో 3,000 కోట్లు లెక్కించడం మోసపూరితం, మూర్ఖత్వం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినవి సున్నా బకాయిలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వం నిర్ణీత ప్రక్రియలో రాష్ట్రానికి షెడ్యూల్ ప్రకారం బదిలీ చేస్తోంది.`` అని పేర్కొన్నారు.

 

బైక్ వాడుతున్నారా..పోలీసులు ఇంకో దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వ‌బోతున్నారు
టీఆర్ఎస్ ఎంపీలు పాలన గురించి తెలుసుకోవడానికి తిరిగి పాఠశాలల‌కు వెళ్లాలని ఎంపీలు ఎద్దేవా చేశారు. ``నీతి అయోగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోదు, వారు ఇచ్చే అనధికారిక సిఫార్సులతో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు జరగవు. ఈ రకమైన మోసపూరిత, అర్థరహిత, దిగజారుడు డిమాండ్లును పార్లమెంటు వేదికగా డిమాండ్ చేసి  రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను మరింత కోల్పోయే విదంగా అధికార పార్టీ ఎంపీలు  వ్యవహరిస్తున్నారు. వీళ్ళ తీరు రాష్ట్రాన్ని మరింత తీవ్రమైన ఆర్థిక సమస్యల్లోకి నడిపించేలా కనిపిస్తుంది. ఇటీవలి CAG నివేదిక ప్రకారం, సీఎం కేసీఆర్ తన సొంత ప్రయోజనాలు నెరవేర్చే పెంపుడు ప్రాజెక్టులు కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ కోసం ఖర్చు చేసిన 2 లక్షల కోట్లకు పైగా లెక్కలనుCAG కు  అందించాలి` అని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

 

కేసీఆర్ అనేక వేల కోట్ల జాతీయ నిధులను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తప్పుదారి పట్టించారని కాషాయ పార్టీ ఎంపీలు ఆరోపించారు. ``ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిధులు , రాష్ట్ర  ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ వద్ద దాచడానికి ఏమిలేకపోతే తనకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన 2 లక్షల కోట్లకు పైగా లెక్కలను CAGకి ఎందుకు సమర్పించడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. సీఎం కేసీఆర్ తన ఆర్థిక అసమర్థత , అవినీతి పద్ధతులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముంచివేసినట్లుగా  బీజేపీ అభిప్రాయపడుతోంది. రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి భారీ అప్పులు సవాలుగా మారానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు పెద్ద భారంగా మారనుంది. ముఖ్యమంత్రి చేసిన  ఈ భారీ రుణానికి నెల నెల వడ్డీ కట్టడానికే తెలంగాణ  రాష్ట్ర ఆదాయం సరిపోయే ప్రమాదముంది.`` అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక రోగం ఉంద‌ని,  ఆ రోగం పేరెందో డాక్టర్లే తేల్చాలని ఎంపీల పేరుతో విడుద‌లైన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ``ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక రోగం ఉంది. తన తప్పులన్నింటిని ఇంకొకరి పై నెట్టడం, ఇతరులు చేసిన మంచినంతా తన ఘనతే అని చెప్పుకోవడం. ఈ రోగం పేరెందో తెలియ‌దు.,.....డాక్టర్లే తేల్చాలి`` అని ఎద్దేవా చేశారు. 
జీతాలు ఇవ్వలేని తమ దుస్థితిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందని, ఇదంతా కేంద్రం వల్లే అని ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశంలో ఆర్ధిక మందగమనం ఉంది వాస్తవమే కానీ ఎక్కడా మాంద్యం లేదన్నారు. దేశంలో వృద్ధి కొంత వేగం తగ్గింది కానీ వృద్ధే లేనట్లుగా సీఎం చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమ‌ని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: