అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. జై అమరావతి.. జైజై అమరావతి.. కొన్ని రోజులుగా కొన్ని చంద్రబాబు అనుకూల ఛానళ్లు, పత్రికల్లో వినిపించిన నినాదమిది. రాజధాని విషయంలో జగన్ సర్కారు చేసేది చాలా తప్పని.. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ ఉద్యమం చేస్తోంది. దీనికోసం అమరావతి పరిరక్షణ ఐకాస అంటూ జేఏసీ ని ఏర్పాటు చేశారు. ఈ జేఏసీలో అన్ని వర్గాలకూ స్థానం కల్పించామని చంద్రబాబు చెప్పారు.

 

అయితే జేఏసీ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. నిజంగా ఇది రాజ‌ధాని ఉద్యమ‌మా ? అంటే కాద‌నే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రి రాజ‌ధాని ఉద్యమం అయితే కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి, ప్రకాశం జిల్లాల ప్రజ‌లు రోడ్ల మీద‌కు వచ్చేయాలి.. కానీ ఇక్కడ ఆరేడు గ్రామాల ప్రజ‌లు మాత్రమే రోడ్ల మీద‌కు వ‌చ్చారు... అక్కడ కూడా కొంద‌రు రాని ప‌రిస్థితి. ప్రధానంగా ఓ కులం వాళ్లే ఎక్కువ‌గా వచ్చారన్నది కాదనలేని సత్యం.

 

అందులోనూ ఎప్పుడూ రోడ్ల మీదకు రాని వర్గాల వారు మాత్రమే ఈసారి రోడ్లపైకి వచ్చారని స్థానికులు చెబుతున్నారు. అందులోనూ అమరావతి వాళ్లు ఎప్పుడూ రోడ్ల మీద‌కు రారు. కానీ.. ఈ సారి వచ్చిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. దీని వెన‌క వాణిజ్య, వ్యాపారుల హంగామా డైరెక్షన్ ఉండ‌నే ఉందని గుర్తు చేస్తున్నారు.

 

రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు. పోరాడితే రాజధాని మార్పు నిర్ణయం ఆగిపోతుందని అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ పోరాటం పేరుకు జేఏసీ పేరుపై సాగుతున్నా అందులో అంతా పసుపు కార్యకర్తలే కనిపించారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. అందుకే ఈ ఉద్యమంపై విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: