ప్రభుత్వంపై బురద చల్లే కథనాలు, వార్తలు రాస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆమధ్య ఓ జీవోను తెచ్చింది. అంటే ఇదేమీ కొత్త జీవో కాదు కానీ అప్పటికే ఉన్నదానికి కాస్త మార్పులు, చేర్పులు చేసి అప్ డేట్ చేసిందంతే. ఇంతోటి దానికే చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలతో పాటు పచ్చమీడియా కూడా జాతీయస్ధాయిలో నానా రచ్చ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయకూడదా అంటూ అందరూ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని, కథనాలు ఇవ్వకూడదని జగన్ ఎక్కడా చెప్పలేదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లే కథనాలు, అసత్యాలు రాస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని తీవ్రంగానే హెచ్చరించారు. నిజానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందే కానీ ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇపుడు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి. ఇపుడు కూడా ఉపేక్షిస్తే ప్రభుత్వం చేతకానిదనే సంకేతాలు జనాల్లోకి వెళ్ళటం ఖాయమే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో  కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఓ లేఖ వెళ్ళింది. ఆ లేఖలో ప్రభుత్వం గురించి, పోలీసు వ్యవస్ధ గురించే తీవ్రమైన ఆరోపణలు ఉండటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నాయి. ఈ లేఖకు పచ్చమీడియా బుధవారం సాయంత్రం నుండి విపరీతమైన పబ్లిసిటి ఇచ్చాయి. అలాగే గురువారం ఎడిషన్లో  రెండు పత్రికలు ప్రముఖంగా మొదటి పేజిలోనే అచ్చేశాయి.

 

అసలు విషయం ఏమిటంటే ఆ లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డ ఏఎన్ఐ అనే వార్తా సంస్ధకు చెప్పారు. అంటే కేంద్ర హోంశాఖకు తన పేరుతో వెళ్ళిన లేఖ బోగస్ అని ఆయనే ఒప్పుకున్నారు.  కానీ పచ్చమీడియా మాత్రం 5 పేజీల లేఖలోని అంశాలన్నింటినీ అచ్చేసేసి చివరలో రెండు లైన్లను మాత్రం నిమ్మగడ్డ ధృవీకరించలేదు అంటూ ఇచ్చాయి. ఇక్కడ అర్ధమవుతున్నదేమిటి ? లేఖ రాయలేదని నిమ్మగడ్డ చెప్పినా, లేఖ బోగస్ అని తెలిసినా జగన్ ను గబ్బు పట్టించటానికే మొత్తం లేఖను అక్షరం కూడా వదలకుండా పచ్చమీడియా అచ్చేసింది. మరి ఇటువంటి మీడియాపై ప్రభుత్వం ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే .....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: