అసలు ఇప్పుడు మీడియా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగస్తులను ఎడాపెడా తొలిగించేస్తున్న సమయంలో అనూహ్యంగా ఓ పెద్ద తలకాయ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లోకి వచ్చి చేరింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో మీడియాలో డిబేట్ లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ముఖ్యంగా ఏపీలో కరోనా ప్రభావం తీవ్రతరం అవ్వడం అధికారపార్టీ దూకుడు ప్రదర్శించడం ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు అనుకూల జగన్ కు వ్యతిరేక మీడియా గా పేరుపొందిన ఏబీఎన్ లో డిబేట్ లు నిర్వహించి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అవకాశం కోసం ఎప్పుడూ abn ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ ఎదురుచూస్తుంటారు. అయితే మిగతా ఛానళ్లలో ఉన్నట్టుగా మీడియా డిబేట్స్ నిర్వహించే సమర్ధం ఉన్న జర్నలిస్ట్ ల కొరత ఏర్పడింది. 

 


గతంలో టీవీ 5  లో పని చేసి వచ్చిన మూర్తి ఏబీఎన్ లో ఉండేవారు. దీంతో డిబేట్ లు నిర్వహించేందుకు ఏ ఆటంకం ఉండేది కాదు. అయితే ఎండి రాధాకృష్ణ తో వచ్చిన విభేదాల కారణంగా మూర్తి ఏబీఎన్ కు రాజీనామా చేసి మహా టీవీ కి వెళ్లారు అక్కడి నుంచి మళ్లీ టీవీ ఫైవ్ కి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలంటే సమర్థమైన జర్నలిస్ట్ అవసరం abn ఆంధ్ర జ్యోతికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ 24 /7 ఛానల్ లో ఉన్న వెంకటకృష్ణ ఇప్పుడు ఏబీఎన్ లోకి వచ్చి చేరారు. ఏపీ 24 /7 లో ఏర్పడిన అంతర్గత విభేదాలతో ఆయన ఆ చానల్ నుంచి బయటికి వచ్చేశారు. 

IHG

ఇప్పుడు ఆయనకు ఏబీఎన్ లో అవకాశం దక్కింది. ఒక సాధారణ కంట్రిబ్యూటర్ గా జర్నలిజం లోకి  ప్రవేశించిన వెంకటకృష్ణ క్రమక్రమంగా ఈ స్థాయికి ఎదిగారు. అయితే ఎక్కడికి వెళ్ళినా ఆయన రాజకీయాల కారణంగా ఆయా ఛానళ్ల నుంచి బయటకు వచ్చేయడం సాధారణంగా మారింది. ఇప్పుడు ఏబీఎన్ లో ఆయన ప్రయాణం ఎంత కాలం ఉంటుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: