ప్రస్తుతం కరోనా ను  నియంత్రించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి వైరస్ రోగులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేయమని ఎవరికి  వారు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. అంతేకాకుండా కరోనా వైరస్ ద్వారా మరణించిన వారిని కూడా ఇతర జబ్బుల  ద్వారా మరణించారు అంటూ తప్పుడు లెక్కలు చూపింది. కాని చివరికి తాజాగా అన్ని లెక్కలు బయటపెట్టే సరికి అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ప్రస్తుతం గుజరాత్ తరహాలో అమెరికాలో  కూడా జరుగుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 అమెరికాలో కరోనా వైరస్  పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు అమెరికా అన్నింటికి సంబంధించి లెక్కలు చెబుతూనే వస్తుంది. తాజాగా  అమెరికా వైద్యపరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నటువంటి నిపుణుడు ఫౌజి  చెప్పిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అమెరికా చూపుతున్నది అన్ని కరెక్ట్ లెక్కలు కావని  చాలామంది వైద్యం అందక ఇళ్లలోనే చనిపోయారు...కానీ వాటిని  ఇతర చావులెక్కలో  రికార్డ్ లు చూపి... అలాంటి వారు ఎంతో మంది చనిపోయారు అనేది మాత్రం లెక్కలు చెప్పలేము అంటూ అమెరికా వైద్య సలహాలు ఫౌజి  తెలిపారు. 

 


 దీంతో బెంగాల్ తరహాలోనే  ఇక్కడ అమెరికాలో కూడా జరుగుతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎలాంటి వైద్యం తీసుకోకుండా ఇందులో మరణించిన వారిని  ఏదో ఒకటి జబ్బు పేరు చెప్పి...  కరోనా  మరణం కిందికి లెక్క తీసుకోకుండా ఉన్నారా.. అయితే ఇప్పటికే అమెరికాలో దాదాపుగా లక్షకు చేరుతున్నాయి మరణాలు.  ఇప్పటికే 70 వేలు దాటిపోయింది. అంటే మూడు లక్షల మరణాలు జరిగితే దాన్ని కవర్ చేయడానికి అమెరికా ఇలా తప్పుడు లెక్కలు చెబుతున్నదా అని  ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఒకవేల  అమెరికా మాత్రమే ఇలాంటి పని చేస్తే నవ్వులపాలు కావడం కాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: