ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డాక్టర్ సుధాకర్ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. డాక్టర్ వృత్తిలో  ఉన్న సుధాకర్ అనే వ్యక్తి ఏకంగా మద్యం మత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని బండ బూతులు తిట్టడం సంచలనంగా మారింది. ఇక సుధాకర్ వ్యవహారం ఎన్నో మలుపులు కూడా తిరిగింది. సుధాకర్ వ్యవహారాన్ని తప్పుబడుతూ ఏకంగా  ఉన్నతాధికారులు అతని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తన ఉద్యోగం తనకు ఇప్పించాలని సుధాకర్ వేడుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. టిడిపి కావాలనే ఇలా తప్పుడు ఆరోపణలు చేయిస్తోంది అంటూ అధికార పార్టీ ఆరోపించింది. 

 


 అయితే డాక్టర్ సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరు తప్పు పడుతూ ఏకంగా  హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా తాజాగా హైకోర్టు దీనిపై విచారణ జరిగింది. సుధాకర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇక ఆయన పై దాడి చేసిన పోలీసులపై ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై  వెంటనే సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి  సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. 

 

 ఎంతో క్లిష్టమైన కేసులను తమదైన శైలిలో విచారణ జరిపి సావ్వ్  చేస్తూ ఉంటారు సి.బి.ఐ. కానీ ప్రస్తుతం సీబీఐ చరిత్రలోనూ ఒక విచిత్రమైన కేసు సిబిఐకి వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఒక వ్యక్తి తాగి ప్రవర్తించిన తీరు పై సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశాలు రావడం నిజంగా చరిత్రలో ఇదే మొదటిసారి అని అంటున్నాడు. అయితే డాక్టర్ సుధాకర్ తాగి ఏం చేశాడు అని సిబిఐ విచారణ చేపట్టాలా... లేక మాస్కులు  కోసం విచారణ చేపట్టాలా  ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: