
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. అన్నీ రకాల వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.. అయితే జల్సా రాయుడులకు మాత్రం జల్సాలు చేయడానికి అడ్డులేకుండా పోయింది.. ఎక్కడ చూసినా కూడా డబ్బు ఉందనే అహంకారంతో ప్రజలు విర్ర వీగుతున్నారు.. ఇకపోతే ఇలాక్ డౌన్ కఠినంగా కొనసాగుతున్న కూడా వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు..
వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ తో అన్ని వ్యాపారాలు మూత పడినా యథేచ్ఛగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం తో పోలీసులు దాడులు చేసి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. గెస్ట్ హౌస్ లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు, ఒక విటుడితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. దాడుల్లో గెస్ట్‌హౌస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్తలాలో జరిగింది.
కపుర్తలా పట్టణంలోని టినీ కాంప్లెక్స్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. బయట దోర్లు క్లోజ్ చేసి లోపల చాటు మాటుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తలుపులను తెరిచారు.. దీంతో అసలు బండారం బట్టబయలు చేశారు..
పోలీసులు ఒక్కసారిగా గది తలుపులు తీయడంతో అభ్యంతరకర రీతిలో ఉన్న ముగ్గురు వెంటనే బట్టలు వేసుకున్నారు. మిగిలిన గదులను తనిఖీ చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్ యజమాని, విటుడు, ఇద్దరు యువతులను అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.లాక్ డౌన్ ఉన్నా కూడా ఇలా అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ దొరకడంతో ఆగ్రహానికి గురయిన పోలీసులు విటులను , మహిళలను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. లాక్ డౌన్ ఉన్నా కూడా విటులు రావడం గమనార్హం అంటూ గుస గుసలు వినపడుతున్నాయి..