రోజు అనగా జూన్ 21 సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దేశంలోని కొన్ని భాగాల్లో ఇది వలయాకారంలో కనిపిస్తుండగా ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకపోతే ఖగోళ శాస్త్రంపై అవగాహన మరియు ఆసక్తి ఉన్న వారు 'రింగ్ ఆఫ్ ఫైర్' లేదా 'అగ్ని వలయాన్ని' చూడగలరు.

 

ఇకపోతే రోజు సూర్యగ్రహణం మొదట మనదేశంలో రాజస్థాన్ లోని ఘర్సానా దగ్గర ఉదయం 10.12 నిమిషాలు నుండి ప్రారంభమవుతుంది. అయితే రేపు సూర్య గ్రహణం అనగా ముందురోజే ఆకాశం నుండి ఒక మూడు కేజీల బరువున్న ఒక ఉల్క లాంటి వస్తువు ఉదయం 7 గంటలకే పడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదికూడా మొట్టమొదట సూర్యగ్రహణం వెలువడే రాజస్థాన్ రాష్ట్రంలోని జరగడం విశేషం.

 

IHG

 

ఆకాశం నుండి పడిన ఉల్క లాంటి పదార్థం చూసేందుకు రాయి లాగా ఉన్నా చాలా విచిత్రంగా ఉంది. మూడు అడుగుల వరకూ భూమిలో తన ఒత్తిడి వల్ల ఒక పెద్ద గుంటనే చేసింది కూడా. ఇకపోతే దగ్గర్లో ఉన్న జనం శబ్దం విని బయటకు రాగా సంచోరె నగరంలోని గాయత్రి చౌక్ ఏరియాలో పెద్ద రాయిని కనుగొన్నారు.

 

వెంటనే వారు పోలీసులకు మరియు స్థానిక అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఇకపోతే సబ్ డివిజనల్ ఆఫీసర్ వస్తువు ఆకాశం నుంచి ఊడి పడినదే అని స్పష్టం చేశారు. అలా దొరికిన ఉల్కను వారు జాగ్రత్తగా భద్రపరిచి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక పోతే ఉల్క వంటి విచిత్రమైన రాయిని ఢిల్లీకి తదుపరి పరిశోధన కోసం పంపించనున్నారు. సూర్య గ్రహణం రోజున సరిగ్గా ఇలా జరగడం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: