విడదల రజనీ... సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న లీడర్. రాజకీయంగా  కూడా ఆమె మంచి బలం ఉన్న నాయకురాలు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె నిలబడిన విధానం, అక్కడ రాజకీయం చేసిన విధానం చాలా మందిని షాక్ కి గురి చేసింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ని ఆమె ఓడించిన తీరు చాలా వరకు ఆశ్చర్యమే. ఆమె ఆ విధంగా నియోజకవర్గంలో తన బలం పెంచుకుని నిలబడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఆమె దృష్టిలో ఉంచుకుని వ్యవహరించి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 

 

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ లో ఆమెకు చాలా మంచి క్రేజ్ వచ్చింది ఫాస్ట్ గా. టీడీపీ వాళ్ళు కూడా ఆమెను ఫాలో అయ్యే వాతావరణం అయితే  ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు సిఎం జగన్ ఆమెకు ఒక కీలక బాధ్యత ఇచ్చే యోచనలో ఉన్నారట. వైసీపీ సోషల్ మీడియా విభాగం కి సంబంధించి కొన్ని ప్రత్యేక అవగాహన తరగతులను ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేయాలని  సిఎం జగన్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెతో కలిపి ఒక టీం ని ఏర్పాటు చేస్తారట. 

 

మూడు దశల్లో... సోషల్ మీడియాను ఏ విధంగా వాడాలి, యువతను ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఎవరికి దగ్గరయ్యే విధంగా పోస్ట్ లు ఉండాలి, సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వేటిని ఏయే సందర్భాల్లో వాడాలి అనే దాని మీద ఇప్పుడు అవగాహనా తరగతులను పార్టీ నుంచి మొదలు పెడుతున్నారు. వాటికి విడదల రజనీ సారధ్యం వహిస్తారట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్దం చేయాలని పార్టీ నేతలకు సిఎం జగన్ సూచనలు చేసారట. వచ్చే నెల చివరి వారంలో ఇది ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: