ఇటీవలే ఒక ప్రధాన పత్రికలో న్యాయ వ్యవస్థ పైన దాడి జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ విషయంపై రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు
ప్రధానమంత్రి మోదీని ఉద్దేశిస్తూ దీనిపైన
లేఖ రాయడం జరిగింది. ఈ
లెటర్ లో ముఖ్యంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, విలేకరులు, సామాజిక కార్యకర్తల ఫోను లను టాప్ చేయించారు.
ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని విన్నవించారు. వ్యక్తిగత గోప్యత కూడా భంగం కలిగించేలా ఉందని దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని విచారణ ఈరోజు హైకోర్టులో జరగనుంది. అధికార
పార్టీ వారికి
ఫోన్ టాపింగ్ చేయడం వారికి దినచర్య గా మారిందని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విషయం అంత తేలిగ్గా తీసుకునేది కాదు. ఇది దేశభద్రతకు మరియు ప్రజాప్రయోజనాలకు ముప్పు కలిగించే విధంగా ఉంది కాబట్టి మీరు దీనిపై స్పందించి త్వరితగతిన విచారణ జరిపించి దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ
లెటర్ లో పేర్కొనడం జరిగింది.
దీనికి మన
ప్రధాని స్పందించడం అటుంచితే, మన రాష్ట్ర హోం
మంత్రి సుచరిత మీడియాతో కింది విధంగా తెలిపారు. చంద్రబాబు ఒకవేళ మీరు అన్న విధంగా మీ
ఫోన్ లను టాప్ చేసినట్లయితే మాకు ప్రతిపక్షంలో ఉన్న మీ
ఫోన్ లను టాప్ చేయవలసిన అవసరం ఏముంది. అలాగే మీరు అనుకున్నట్టు మిగతావారు అనగా మీ శ్రేయోభిలాషులు న్యాయమూర్తులు ఇతర రాజకీయ నాయకులు ఫోను లను మేము టాప్ చేయలేదని మీకు తెలుసు. గతంలో మీరు చేసిన పనులన్నీ మేము చేస్తున్నాము అనుకోవడం మీ పొరపాటు. మీ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ప్రభుత్వానికి సమర్పించండి, అలా కాని పక్షంలో మీరు ఎటువంటి శిక్ష కైనా సిద్ధపడండి. ఇలా ప్రభుత్వం పై అర్థంలేని ఆరోపణలు చేయడం మీకు తగదు. అసలు మీ
ఫోన్ ను టాపింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? మీరేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా? కాబట్టి ఇకనైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం మరచి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము.
దీనికి ఇదే విషయంపై
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి అయిన
గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, మీరు చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కావు, చాలా తీవ్రమైనవి. కాబట్టి మీరు దయచేసి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసువారికి ఇవ్వండి. తద్వారా మేము విచారణ జరిపి తగిన చర్యలను తీసుకుంటాము. మాకైతే ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ అందలేదు. ఈ విధంగా ఉంటే ఇప్పటికీ సీఎం గారు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరి ఇకనైనా సీఎం
జగన్ స్పందిస్తారో లేదో చూడాలి.