తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రెవెన్యూ చట్టం పై సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనదైన రీతిలో అధికార పార్టీ పై రెచ్చిపోయారు ప్రభుత్వం వారు చెబుతున్న విధంగా ధరణి పోర్టల్ ద్వారా సమస్య పరిష్కారం కాదని ఫీల్డ్ సర్వే చేయడం ద్వారానే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి కుండానే ఆమోదించడం అన్యాయంగా లేదని తీవ్రంగా విమర్శించారు.కేసీఆర్ యొక్క వైఫల్యాన్ని తప్పించుకునేందుకు కొత్త రెవెన్యూ బిల్లు తెచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు.


ప్రజలందరికీ కొత్త పాస్ బుక్కులు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు సర్వే చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వేల కోసమని 200 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు ఈ భూ సర్వే ను పూర్తి చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆలస్యంగా సర్వే చేస్తుండడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని దీనికి ప్రతిఫలంగా వారికి ఒక నెల జీతం బోనస్ గా కూడా ఇచ్చి, ఇప్పుడు ఈ విధంగా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. 


అధికారంలో లేని వీఆర్వోలను అవినీతిపరులుగా చెబుతూ అదేవిధంగా అధికారం ఉన్న ఎమ్మార్వో, ఆర్ డి వోలు మరియు ఇతర అధికారులను నీతిమంతులుగా చూపించడం కేసీఆర్ కు ఏ విధంగా సబబుగా ఉందో జీవన్ రెడ్డి కేసీఆర్ పై మరియు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దీనికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను మరియు తాము ఇచ్చిన హామీలను  నెరవేర్చుకుంటూ పోతున్నామని అనేకసార్లు మీడియా ముందు చెబుతున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: