ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించాలని వాహనదారులకు ఎన్నిసార్లు సూచనలు చేసినప్పటికీ వాహనదారులు మాత్రం ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘిస్తు  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచిస్తూ... ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆలోచించే విధంగా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. హీరోల సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ప్రమాదాలు తప్పవు అంటూ హెచ్చరిస్తుంటారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న హార్థిక్ పాండ్యా కు సంబంధించిన ఒక ఫోటో ఉదాహరణగా తీసుకొని సరిగా ఆడక పోతే బౌల్డ్ అవ్వడం ఖాయం... రోడ్డు నిబంధనలు పాటించకపోతే ప్రమాదం జరగడం ఖాయం అని హెచ్చరించారు.



 ఇక ఇప్పుడు మరో సారి వినూత్నంగా వాహనదారులు అందరిని ఆలోచనలో పడేసారు  తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎంత పాపులారిటీ సంపాదించినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ ఉన్న షో గా దూసుకుపోతుంది బిగ్ బాస్. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ని ఉదాహరణగా చూపిస్తూ ప్రస్తుతం వాహనదారులను అలర్ట్  చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవలే దుర్గం చెరువు పర్యాటక శోభను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది పర్యాటకులు దుర్గం చెరువు వీక్షించేందుకు వస్తున్నారు.



 అదే సమయంలో కొంతమంది వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు మరిచి రోడ్డుపైనే వాహనాలు  ఆపి ఏకంగా ఫోటోలు దిగడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటి వారిని హెచ్చరించేందుకు.... దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు ఆపి ఫోటోలు తీయడం లాంటివి చేస్తే సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని..  జరిమానాలు పడతాయని... బిగ్ బాస్ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు అంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా  అది కాస్త వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: