కొన్ని కొన్ని విషయాల్లో ఏపీ సీఎం జగన్ ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విషయాల్లో ఎక్కడా రాజీ పడేందుకు ఇష్ట పడడం లేదు. ప్రజల కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నా, అనవసర నిందలు ఎందుకు మోయాలి అనే అభిప్రాయం జగన్ లో ఉంది. అందుకే ప్రతి పథకం లోనూ, ప్రతి నిర్ణయం లోనూ పారదర్శకతను పెంచి, జనాల్లో ఉన్న అనుమానాలను ఏవిధంగా తీర్చాలి అనే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. 


తాజాగా ఓ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా జగన్ నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం లో వెల్లడించారు. ముందుగా ఓ ముసాయిదాను తయారు చేసి, దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని జగన్ సమావేశంలో పేర్కొన్నారు. ఇసుక వివాదంలో మొదటి నుంచి ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. పారదర్శకతను పెంపొందించే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. మంత్రులతో సమావేశం సందర్భంగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


" ఇసుక తవ్వకాలు సరఫరాలు ఎక్కడ అవినీతికి తావు ఉండొద్దు. పూర్తి పారదర్శకంగా విధానం ఉండాలి. ధర కూడా రీజనబుల్ గా ఉండాలి. అలాగే ఇసుక సరఫరాలో ఎఫిషియన్సీ పెంచాలి. నాణ్యమైన ఇసులనే సరఫరా చేయాలి. పూర్తి నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలి. ఇసుక రీచ్ లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇసుక రవాణా వ్యయం  ఎక్కువగా ఉంది. అది రీజనబుల్ గా ఉండాలి. చలం కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకు పోయే విధంగా ఉండాలి.


ఏ రేటుకి అమ్మాలి అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ జరగాలి అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్ బీ ఈ రంగప్రవేశం చేస్తుంది.ఎవరికి వారు రీచ్ కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి " అంటూ జగన్ ఆ సమావేశం వ్యాఖ్యానించారట. మొత్తం ఈ వ్యవహారంపై ముసాయిదా రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చేపట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: