తద్వారా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతో మంది విద్యార్థులకు ఆయా స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాబోధన చేసేందుకు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అదే సమయంలో ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా నీట్ జేఈఈ పరీక్షలకు సంబంధించిన ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దక్షిణ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముందుకు వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ కుమార్ తెలిపారు. దీనివల్ల దాదాపుగా పది వేల మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి