దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి  అన్న విషయం తెలిసిందే.  ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం తిరుమలలో కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడి గా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పుణ్యఫలం పొందుతూ ఉంటారు ఎంతోమంది భక్తులు.



 ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల నుంచి తిరుమలకు కొన్ని ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బస్సు, రైలు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.  ఈ క్రమంలోనే ఇక ఆయా సర్వీస్లను ఉపయోగించుకుని ఎంతో మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొందుతూ ఉంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఎప్పుడు సరికొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది, స్టార్ ఎయిర్ అనే సంస్థ కలబురగి నుంచి తిరుపతికి ఇటీవలే విమాన సర్వీసులను ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది.  కలబురిగి  నుంచి తిరుపతికి ప్రతి సోమవారం,బుధవారం,శుక్రవారం, ఆదివారం ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.




ఉదయం 9.55 గంటలకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు తిరుపతి వచ్చేస్తుంది. రిటర్న్ జర్నీ మధ్యాహ్యం 2.25 గంటలకు స్టార్ట్ అవుతుంది. కలబురగికి సాయంత్రం మూడున్నర గంటల కల్లా వచ్చేస్తుంది. ఇక రానున్న రోజుల్లో ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు కూడా సర్వీసులు ప్రారంభించాలని స్టార్ ఎయిర్‌ను సంస్థను కోరుతున్నారు భక్తులు. స్టార్ ఎయిర్ ద్వారా ఇప్పటికే కలబురగి నుంచి బెంగళూరు, ఢిల్లీకి విమాన సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా తిరుపతికి సర్వీసులు ప్రారంభించామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: