టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది ? ఏదో ఒక రకంగా తాను అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టు గా సాధించి తన సత్తా చాటుకోవడం లో ఆయనను మించినవారు ఎవరూ ఉండరు.అసలు బాబు రాజకీయమే సంథింగ్ స్పెషల్ అన్నట్టు గా ఉంటుంది. తాను ఏ నిర్ణయం అయితే తీసుకున్నా డో అదే నిర్ణయం జనాలు కూడా తీసుకుని బాబు గారు సూపర్ అని జనాల తోనే పలికించాలి అనే విధంగా బాబు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి బాబు లో మార్పు రాకపోగా, కేవలం విమర్శలు చేస్తూ తమ ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ, రాజకీయంగా పైచేయి సాధిస్తున్నాం అనే భ్రమలో ఉంటున్నారే తప్ప, వాస్తవ పరిస్థితి ఏమిటి ? పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో బాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. 





ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై విమర్శలు చేస్తూ బాబు హడావుడి చేస్తున్నారు.. లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. కానీ టిడిపి హయాంలో ఇంతట భారీ స్థాయిలో పథకాలు లేవు. అలాగే టీడీపి ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లోనూ అనేక లోపాలు ఉన్నాయి. కానీ వాటి గురించి సమీక్ష చేసుకోకుండా, అసలు ప్రజలు తమకు ఇంతటి దారుణమైన ఓటమికి ఎందుకు గురి చేశారు అనే  విషయంపైన పూర్తిస్థాయిలో సమీక్ష చేసుకోకుండా,  కేవలం విమర్శలు వరకే పరిమితం అవుతూ, పార్టీ నాయకులను అదేవిధంగా తయారు చేస్తూ, బాబు ముందుకు వెళుతున్న తీరు రాబోయే రోజుల్లో టీడీపీకి అనుకున్నంత స్థాయిలో మైలేజ్ అయితే తీసుకు వచ్చే అవకాశమే కనిపించడం లేదు. అసలు 2019లో ఓటమికి కారణాలు, వాస్తవ పరిస్థితులు ఏమిటనేది సమీక్ష చేసుకోవడంలో బాబు నిర్లక్ష్యం వహిస్తూ , పార్టీని అంతే స్థాయిలో నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాడు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: