ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం దేశంలోని ఏ బ్యాంకుకు లేనంత  ఎక్కువ ఖాతాదారులను కలిగి ఉన్న బ్యాంకుగా  నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటు ఉంది. అయితే కొన్ని విషయాలలో మాత్రం స్టేట్ బ్యాంక్ ఖాతాదారుడు ఇతర బ్యాంకుల తో పోలిస్తే తక్కువ ప్రయోజనాలను పొందుతారు అని చెప్పాలి.



 ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉంటే మీరు తప్పక ఏ విషయాన్ని తెలుసుకోండి. అన్ని   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతా లపై అతి తక్కువ వడ్డీ లభిస్తోంది.  దీంతో స్టేట్ బ్యాంకు అకౌంటు ఉన్న వారికి తక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.  ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉంటే మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.  బ్యాంక్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్నో ప్రభుత్వం  ప్రైవేటు రంగ బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 అందుకే ఎవరైనా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని భావిస్తే ప్రస్తుతం ఏ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో వడ్డీ  వస్తుందో ముందుగా చూసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలపై చాలా తక్కువ వడ్డీ లభిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల కీలక నిర్ణయాలు తీసుకుని తమ కస్టమర్లను  పెంచుకోవడానికి అధిక వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐడిబిఐ , కెనరా బ్యాంకు లాంటి బ్యాంకుల కస్టమర్లకు సేవింగ్స్ ఖాతా పై అధిక వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: