ఈ క్రమంలోనే రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా అందరూ విరాళాలు అందజేయాలి అంటూ రామమందిర ట్రస్టు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఏకతాటి పైకి వచ్చారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు అధికారులు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు ఇలా అందరూ కూడా అయోధ్య రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ కి విరాళాలు అందజేశారు అన్న విషయం తెలిసిందే. అయితే వీరందరూ విరాళాలు అందజేయడం ఒక ఎత్తైతే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి విరాళాలు అందించడం మరో ఎత్తు.
ఇలా ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న అందరు ప్రజలు కూడా తమకు తోచిన స్థాయిలో రామమందిర నిర్మాణానికి విరాళాల అందజేశారు. అయితే 1100 కోట్లతో రామమందిర నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ ఏకంగా రెండు వేల రెండు వందల కోట్లకు పైగానే వచ్చాయి విరాళాలు అన్న విషయం తెలిసింది. అదే సమయంలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారి వివరాలను క్రమక్రమంగా వెల్లడిస్తోంది ట్రస్ట్. ఏకంగా దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల గ్రామాలకు చెందిన ప్రజలు..రామ మందిర నిర్మాణం కోసం ఏకతాటిపై వచ్చి భారీగా విరాళాలు అందించడం గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి