సాధారణంగా జంతు ప్రేమికులు తమకు ఏదైనా జంతువులు చూడాలి అనిపిస్తే జూ పార్కు వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని రకాల జంతువులను చూసి మురిసిపోతూ ఉంటారు  అయితే ఇలాంటి జంతు ప్రేమికులకు ఇటీవలే హైదరాబాద్ జూ పార్క్ నిర్వాహకులు 2 దుర్వార్తలు చెప్పారు. ఇటీవలే హైదరాబాద్ జూ పార్క్ లో ఉన్న 83 ఏళ్ల ఆడ ఏనుగు మృతి చెందింది అన్న విషయాన్ని తెలిపారు జూ పార్క్ నిర్వాహకులు. అంతేకాకుండా మరోవైపు 21 ఏళ్ల మగ చిరుతపులి కూడా మృతి చెందినట్లు తెలిపారు.  అయితే 83 ఏళ్ల ఏనుగును రాణి అని జూపార్క్ నిర్వాహకులు ప్రేమగా పిలుచుకునే వారు.. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఏనుగుతో నిర్వాహకులకు ఎంతగానో అనుబంధం ఏర్పడింది.



 అయితే ఈ 83 ఏళ్ల ఏనుగు ఎన్నో దశాబ్దాల నుంచి బోనాల కార్యక్రమంలో ముహర్రం ఊరేగింపులో కూడా పాల్గొనేది. ఈ క్రమంలోనే అటు ప్రజలకు కూడా ఎంతో చేరువైంది రాణి. అయితే ఇప్పటికే 83 ఏళ్లు రావడంతో వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చింది ఏనుగు. ఇక ఈ  వృద్ధ ఏనుగు  ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం కేవలం వైద్యులు అందిస్తున్న ఔషాదాల మీదనే గత కొన్ని రోజుల నుంచి రాణి జీవిస్తున్నట్లు జూ పార్క్ నిర్వాహకులు  తెలిపారు.




 అయితే ఈ 83 ఏళ్ల రాణి ని ఎన్నో హాస్పిటల్స్ లో యాజమాన్యాలు సైతం దత్తత తీసుకొని కొన్ని రోజులపాటు ఔషధాలు సైతం అందించాయి. ఇక ఇటీవలే ఆరోగ్యం విషమించడంతో ఏనుగు కాస్త చివరికి కన్నుమూసింది. సాధారణంగా జూ లో బందించినటువంటి ఆసియా ఏనుగుల జీవితకాలం 70 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది  కానీ  రాణి ఏకంగా 83 ఏళ్లు జీవించింది. అయితే ఇక రాణి చివరి రోజుల్లో కూడా ఎలాంటి శారీరక బాధలు లేకుండా కన్ను మూసింది అని జూ పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తమకు రాణి అనే ఏనుగుతో ఎంతగానో అనుబంధం ఉందని  ఇక ఇప్పుడు ఈ ఏనుగు కన్నుమూయడం ఎంతో బాధ కలిగించింది అంటూ తెలిపారు అక్కడి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: