ఒక దశ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అనుకునేలోపే.. రూపాంతరం చెందిన మరో దశ కరోనా వైరస్ ప్రభావం వేగంగా పాకిపోతుంది. దీంతో ప్రపంచ దేశాలు కరోనా వైరస్ బారి నుంచి కోలుకోలేక పోతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని దేశాలు కూడా ఇక ఇప్పుడు వ్యాక్సిన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయ్.  వ్యాక్సిన్ ద్వారా అందరిలో యాంటీబాడీలను వృద్ధి చేసి వైరస్ పై పోరాటానికి సిద్ధం చేయాలని అన్ని దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయ్.  అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఫై అందరికీ అవగాహన పెరిగి పోయింది. వ్యాక్సిన్ వేసుకుంటే ఎంతో మంచిది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకో సోషల్ మీడియాలో ప్రచారాలు. ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోవడం మంచిది అని తెలిసినప్పటికీ వేసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు ఎంతోమంది.


 వేసుకోవడం వల్ల ఏదైనా దుష్ప్రభావాలు వస్తాయి ఏమో ప్రాణాల మీదికి వస్తుందేమో అన్న అనుమానాలు కూడా అందరిలో నెలకొన్నాయి. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక వేర్వేరు వ్యాక్సిన్ లను వేసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే అనుమానాలు కూడా అందరిలో నెలకొన్నాయి.  ఇప్పటికే పలు దేశాలలో డాక్టర్లు ఇలా కొన్నిసార్లు ఏకంగా రెండు వేరువేరు వ్యాక్సిన్లు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే రెండు వేరు వేరు టీకాలు వేసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపై ఇటీవల అత్యంత కీలక విషయాలు బయటపడ్డాయి.



 రెండు రకాల వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల లాభమే ఉంటుంది అని ఇటీవలే ఆక్స్ఫర్డ్ యునివర్సిటీ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు  తొలిదశగా ఆస్ట్రోజనిక  టీకా తీసుకుని మరో రెండవ డోస్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో.. యాంటీబాడీలు సాంద్రత అధికంగా ఉంది అని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకే రకం వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న దానికంటే వేరువేరు టీకాలు రెండు రోజులు తీసుకుంటే మరింత ఎక్కువగా యాంటీ బాడీలు కనిపించినట్లు చెప్పుకొచ్చారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఇలా రెండవ డోసు వేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.  అయితే భారత్లో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: