సాధారణంగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకోవడం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.  ఇద్దరు ముగ్గురు ఖైదీలు కలిసి పక్కా ప్లాన్ వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు.  సమయం రాగానే తమ ప్లాన్ కి పదును పెట్టి..  ఇక పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అయితే పోలీసులకు చిక్కి మళ్లీ అదే జైలుకు వస్తూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి.  మరికొంతమంది జైలు నుంచి తప్పించుకుని  పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.



 నిజ జీవితంలో మాత్రం ఖైదీలు అలా తప్పించుకోవడానికి సాహసం చేయరు  ఒకవేళ ఖైదీలు తప్పించుకోవాలి అనుకున్నప్పటికీ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో అది కూడా కుదరదు. కానీ ఇటీవల కాలంలో ఇలా జైలు నుంచి ఖైదీలు తప్పించుకుంటున్న  ఘటనలు వెలుగులోకి వస్తు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల జైలు లో నుండి ఖైదీలు పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యారు. ఏకంగా పోలీసుల కళ్లలో కారం కొట్టి తప్పించుకున్నారు అరుణాచల్ ప్రదేశ్ పాజిఘాట్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.


 ఇటీవలే రాత్రి భోజనం సమయంలో జైలు అధికారులు గేట్లు తెరిచారు.ఈ క్రమంలోనే అంతకుముందే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు 7గురు ఖైదీలు. ఇక ప్లాన్ ప్రకారం గేట్లు తెరవగానే పక్కనే ఉన్న పోలీసులకు కళ్ళల్లో కారం కొట్టారు. ఓ వైపు పోలీసులు కళ్ళు మండి పోతున్నాయని బాధపడుతుంటే ఇక అదే సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే జైలు నుంచి పరారయ్యారు. ఇక వెంటనే జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు  ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ నిబంధనలను కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నా.. ఎక్కువ దూరం ప్రయాణించ లేరు అని ప్రస్తుతం పోలీసు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలను పట్టుకుంటాము అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: