కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగాన్ని మరింత పటిష్టవంతంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది మోడీ ప్రభుత్వం.  మొదటినుంచి ఇక దేశ బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎన్నో నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోంది.  ఈ క్రమంలోనే భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టవంతం చేసే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను భారత ఆర్మీలో చేరుస్తుంది.  వివిధ దేశాల నుంచి యుద్ధ విమానాలను ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.  అదే సమయంలో అటు భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కి భారీగా నిధులు కేటాయిస్తూ వినూత్నమైన ఆయుధాల తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం .



 ఈ క్రమంలోనే ఇక గత కొంత కాలం నుంచి డి ఆర్ డి ఓ  ఎన్నో అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేసింది. యుద్ధ విమానాలను కూడా తెర మీదకు తీసుకొచ్చింది  అయితే డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధాలకు శరవేగంగా ప్రయోగాలు నిర్వహించి భారత ఆర్మీలో చేరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఆయుధ విక్రయాలను కూడా ప్రారంభించి అగ్రరాజ్యాలకు సైతం షాక్ ఇస్తుంది. అయితే భారత వైమానిక రంగాన్ని  ఎంతో పటిష్టవంతంగా మార్చేందుకు రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఎన్నో ఏళ్ల కింద ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఇక ఫ్రాన్స్ తో రాఫెల్ కోసం  ఒప్పందం నేపథ్యంలో ఇప్పటికే పలు యుద్ధ విమానాలు భారత్ వచ్చి చేరాయి.



 ఇటీవలే ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోవడం గమనార్హం.  ఫ్రాన్స్ లోని ఇన్ స్ట్రైట్ వైమానిక కేంద్రం నుంచి సుమారు ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత చేరుకున్నాయి రాఫెల్ యుద్ధ విమానాలు. ఇటీవలే ఈ రఫెల్ యుద్ధ విమానాలు భారత్ కి చేరుకున్నాయి అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంచేసింది. మధ్యలో యూఏఈ ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్లు రాఫెల్ యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపాయి. ఇక ఇప్పుడు భారత ఆర్మీలో మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో ఇక భారత ఆర్మీ మరింత బలం గా మారిపోయింది అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఫ్రాన్స్ ఉపయోగిస్తున్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాలలా కాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించి భారత్ కోసం రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసేది ఫ్రాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: