గతంలో కొంతమంది నాయకులు వైఎస్సార్టీపీని వీడినా ఇంత పెద్ద డిస్కషన్ జరగలేదు. కానీ ఇందిరా శోభన్ పార్టీకి రాజీనీమా చేసే సరికి దీన్ని సంచలనంగా పేర్కొంటున్నారు. అవును, కాస్తో కూస్తో తెలంగాణలో ఇందిరా శోభన తన వాయిస్ వినిపిస్తున్నారు. అలాంటి వాయిస్ కూడా ఇక షర్మిలకు లేదు. భవిష్యత్తులో ఆ స్థాయి నాయకులు పార్టీలో చేరతారనే అంచనాలు కూడా లేవు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది. ఓ యూట్యూబ్ ఛానెల్ లో వచ్చిన వార్తతో ఇందిరా శోభన్ వ్యవహారం హైలెట్ అయింది.
మూడు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఇందిరా శోభన్ ని "మీరేం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా" అంటూ కాస్త ఘాటుగా హెచ్చరించారు షర్మిల. అందరి ముందు అలా మైక్ లో ఆ స్థాయి లీడర్ ని కించపరిచేలా మాట్లాడటంతో చాలామంది షాకయ్యారు. ఆ తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా ఓ యూట్యూచ్ ఛానెల్ ఆ వీడియోని అంతవరకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఇందిరా శోభన్ అభిమానులంతా రెచ్చిపోయారు. "అక్కా మీకిది తగునా, మీ స్థాయి ఎంత, షర్మిల స్థాయి ఎంత.. ఆవిడతో మాటలు పడాలా..? ఆవిడ కింద మీరు పనిచేయాలా..?" అంటూ కామెంట్లు పెట్టారు. మందలించడంలో కూడా ఓ పద్ధతి ఉంటుంది, మరీ గాడిదలు కాస్తున్నారా అనే సరికి అందరికీ కోపమొచ్చింది. అక్కడ మొదలైన కామెంట్ల ప్రవాహం దాదాపుగా ఇందిరా శోభన్ వరకు వెళ్లింది. భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా తెలియని పార్టీలో ఎందుకీ అవమానాలు అంటూ ఆమె ఆలోచనలో పడ్డారు. దీంతో కొన్నాళ్లుగా ఆమె అంతర్మథనం చెందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీకి రాజీనామా చేశారు.
అప్పటికప్పుడు ఆ సందర్భంలో షర్మిల మాటలకు ఇందిరా శోభన్ నొచ్చుకోక పోయినా, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల వల్ల ఆమెకు చాలామంది సలహాలిచ్చారు. వైఎస్సార్టీపీలో ఉండొద్దని కోరారు. తన రాజీనామా లేఖలో కూడా ఆమె ఈ విషయాలను ప్రస్తావించడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి