మరికొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ పండుగ సీజన్ నేపథ్యంలో అటు అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ లను బాగా సద్వినియోగం చేసుకోవడానికి అటు జనాలు కూడా సిద్ధమైపోతున్నారు అనే చెప్పాలి. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు అయితే ఇప్పటినుంచే ఆఫర్లు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రైవేటు రంగ బ్యాంకులు గా కొనసాగుతున్న కోటక్ మహేంద్ర బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక అదిరిపోయే శుభ వార్త చెప్పింది



  ఏకంగా హోమ్ లోన్స్ పై వడ్డీరేట్లను తగ్గిస్తు నిర్ణయం తీసుకొని కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు  హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రకటించిన ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 నుంచి అందుబాటులో ఉంటుంది. నవంబర్ 8 వరకు కస్టమర్లు ఈ ఆఫర్ను పొందేందుకు అవకాశం ఉంటుంది. కేవలం పండుగ సీజన్ మాత్రమే దృష్టిలో ఉంచుకుని కోటక్ మహేంద్ర బ్యాంక్ ఈ ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. ఎంతోమంది కస్టమర్లు ఈ పండుగ సీజన్లో  మరింత ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది అంటూ చెప్పుకొచ్చింది.




 మరీ ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఎక్కువ మంది గృహ రుణాలు పొందడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి తరుణంలో ప్రస్తుతం హోమ్ లోన్స్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే కస్టమర్లు మరింత ఆకర్షించేందుకు ఆయా బ్యాంకులు వినూత్నమైన ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తూ ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునేవారికి  కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రకటించిన ఆఫర్  మాత్రం ఆకర్షణీయమైనది అని చెప్పాలి.  ఇకపోతే మరికొన్ని రోజుల పండుగ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మిగతా బ్యాంకులు కూడా ఎలాంటి ఆఫర్లు ప్రకటించబోతున్నాయ్ అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: