ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత క్యాబినెట్‌లో ఉన్నారు...ఆమె తప్పుకుంటే జిల్లాకు ఖచ్చితంగా రెండు పదవులు వచ్చే అవకాశం ఉంది. అదృష్టం బాగుంటే మూడు పదవులు కూడా రావొచ్చు. ఇప్పటికే పదవులు ఆశించే లిస్ట్ పెరుగుతుంది. అంబటి రాంబాబు, విడదల రజిని, కోన రఘుపతి, ముస్తఫాలు పదవులు ఆశిస్తున్నారు. అయితే రెడ్డి వర్గంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు లైన్‌లో ఉన్నారు.
జిల్లాలో రెడ్డి వర్గం నుంచి ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా జగన్...ఆళ్ళకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మొదట విడతలో ఛాన్స్ దక్కలేదు. మరి ఈ విడతలో ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి. ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కకపోతే ఆళ్ళకు భవిష్యత్‌లో మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ వచ్చేలా లేదు.
అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవి ఆశిస్తున్నారు. పైగా గుంటూరు జిల్లాలో వైసీపీలో ఉన్న పవర్‌ఫుల్ ఎమ్మెల్యే ఈయనే. అసలు మాచర్లని వైసీపీకి కంచుకోటగా మార్చేశారు. ఇంకా ఎన్నిసార్లు అయినా ఇక్కడ పిన్నెల్లికి తిరుగులేదనే చెప్పొచ్చు. మరి అలా తిరుగులేని ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ ఆళ్ళ, పిన్నెల్లిల్లో ఒక్కరికే జగన్ ఛాన్స్ ఇవ్వాలి. మరి వీరిలో జగన్ ఛాయిస్ ఎవరో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి