టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ఆగ‌డాల‌పై స‌రి కొత్త‌గా నిర‌స‌న తెలియ జేసేందుకు రెడీ అవుతున్నారా ?  ఏపీ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌న‌లో కొన‌సాగుతోన్న ద‌మ‌న కాండ‌ను జాతీయ స్థాయిలో తెలియ జేసేందుకు ఆయ‌న రెడీ అవుతున్నారా ? అంటే ఆ పార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న స‌మాచారం ప్ర‌కారం అవుననే తెలుస్తోంది. మామూలుగా చంద్ర‌బాబు కు ఓ ప‌ట్టాన కోపం రాదు.. ఆయ‌న ప్రెస్ మీట్ల లో కూడా ఎంతో కూల్‌గానే ఉంటారు. అయితే నిన్న పార్టీ ఆఫీస్ పై జ‌రిగిన దాడి , పార్టీ ఆఫీస్‌కు వ‌చ్చి అక్క‌డ ప‌ని చేస్తోన్న వారిని కొట్ట‌డం చంద్ర‌బాబు త‌ట్టు కోలేక పోయారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప్రెస్ మీట్లో తీవ్ర స్థాయిలో విరుచు కు ప‌డ్డారు. తాను డీజీపీకి ఫోన్ చేసినా స్పందించ లేద‌ని మండిప‌డ్డారు. ఏదేమైనా పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిని చంద్ర‌బాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిని తీవ్రంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు ఏం చేయాల‌నే దానిపై పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వైపు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు ఆయ‌న అపాయింట్ మెంట్ కూడా కోరారు.

మ‌రో వైపు చంద్ర‌బాబు ఈ దాడికి నిర‌స‌న‌గా పార్టీ కార్యాల‌యంలో 36 గంట‌ల పాటు నిర‌స‌న దీక్ష చేసేందుకు రెడీ అవుతున్నారు. రేపు ఉద‌యం 8 గంట‌ల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంట ల వ‌ర‌కు 36 గంట‌ల పాటు ఏక‌ధాటిగా దీక్ష చేయ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వం లో జ‌రుగుతోన్న అరాచ‌కాలు, ఈ ద‌మ‌న కాండ ను జాతీయ స్థాయిలో చెప్పాల‌న్న‌దే ఆయ‌న ఉద్దేశం గా క‌నిపిస్తోంది. ఇక శ‌నివారం ఆయ‌న ఢిల్లీ వెళ్లి మ‌రీ ఆయ‌న అమిత్ షాను క‌లిసి ఫిర్యాదు చేయ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: