ప్రశాంతంగా ఉన్న ఏపీలో  టీడీపీ నేతలు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు అంటూ మంత్రి కొడాలి నానీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. లోకేష్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలోనే సీఎంపై ఆరోపణలు  అని ఆయన విమర్శించారు. ఏపీ నుంచి దేశం మొత్తం డ్రగ్స్ సప్లయ్ అంటూ టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారు అని అన్నారు ఆయన. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు అని విమర్శలు గుప్పించారు.

పెయిడ్ ఆర్టిస్ట్ లతో  భూతులు సీఎంను,మంత్రులను భూతులు తిట్టిస్తున్నారు అని ఆరోప్న్చారు. చంద్రబాబు ఉహించినట్లే డ్రామాకు వ్యూహా రచన చేశారు అని చంద్రబాబు ఒక చీటర్,420 అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కుట్రలతో టీడీపీని ఎన్టీఆర్ దూరం చేశారని లక్ష్మీ పార్వతిని భూచిగా చూపి టీడీపీని లాగేసుకున్నారు అంటూ ఫైర్ అయ్యారు. వైస్సార్ సీఎంగా ఉంటే చంద్రబాబు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు అని పరిటాల రవి చనిపోతే  జగన్ కు ముడి పెట్టాడు అని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగిన  జగన్ కు ముడిపెడుతున్నారు అని విమర్శలు చేసారు. అమిత్ షా దగ్గరకు వెళ్ళడానికి సిగ్గు శరం లేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ను భూతులు తిట్టి సింపతి పొందాలని చూస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు దొంగ దీక్షలు చేసి వైసీపీని ఏమి చేయలేవు అని హెచ్చరించారు. పట్టాభితో చంద్రబాబు కావాలని భూతులు తిట్టిస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు  భూతులు తిట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబును ఏరోజు నేను పర్సనల్ గా తిట్టలేదు అని కొడాలి నానీ అన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ చెప్పిన మాటలే నేను చెప్తున్నా అన్నారు. హెరిటేజ్ ఫ్రెష్ లో చంద్రబాబు గంజాయి అమ్ముతున్నారు అని విమర్శించారు. చంద్రబాబు బంద్ కు పిలుపిస్తే హెరిటేజ్ కూడా ముయ్యలేదు అని అన్నారు మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap