
పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆయన స్వయంగా సహాయక చర్యల ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక గురువారం ఉదయం కూడా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పలు ప్రాంతా ల్లో ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే .. మరి కొన్ని చోట్ల 40 నుంచి 30 మిల్లీ మీటర్ల మేర వర్షాలు కురివాయి.
ఇక సాయంత్రం 6 గంటలకు అయితే అన్ని ప్రధాన రహదారులు నదులు, చెరువులను తలపించేశాయి. నగరం మొత్తం మీద 500 కు పైగా కాలనీలు నీట మునిగి పోయాయి. ఇక నగరం లో ఎక్కడి కక్కడ భారీ ఎత్తున చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగి పోయి ప్రజలు ఇళ్ల ల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి.