పార్ట్ టైమ్ జాబ్ అంటూ లవ్ లైఫ్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సుమారు 200కోట్ల రూపాయలు ఈ స్కాంలో బాధితులు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వస్తున్నారు. టైలింజిన్ అనసూయ అనే మహిళ టెలిగ్రామ్ యాప్ ద్వారా గ్రూప్ క్రియేట్ చేసి.. మెడికల్ డివైజ్ ల రీఛార్జ్ లకు పెట్టుబడులు పెట్టాలంటూ అమాయకులను ముంచేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనసూయ కోసం గాలిస్తున్నారు.
ఇక ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఫేస్ బుక్ లో ఓ సైబర్ నేరస్థుడు అర్తీ అనే పేరుతో పరిచయమయ్యాడు. మాటలు కలిపి ఆమె వివరాలు సేకరించాడు. కొన్నాళ్లకు 55లక్షల రూపాయల విలువైన గిఫ్ట్స్ ఆమెకు వచ్చాయని ఫోన్ చేశాడు. అవి ముంబైలో ఉన్నాయనీ.. కొంత చెల్లిస్తే పంపిస్తానని నమ్మించాడు. అలా దాదాపు 42లక్షల రూపాయలు కాజేశాడు. ఎంతకీ గిఫ్ట్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
మరోవైపు మెట్రో నగరాలు, పెద్ద సిటీల్లో 2022లో 5జీ సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు కేంద్ర టెలీకమ్యూనకేషన్స్ శాఖ ప్రకటించింది. గురుగ్రామ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జామ్ నగర్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పుణె నగరాల్లో 5జీని ప్రారంభించేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ట్రయల్స్ మొదలు పెట్టాయి. 4జీలో సెకనుకు 250 ఎంబీపీఎస్ డేటా ట్రాన్స్ ఫర్ అవుతుండగా.. 5జీలో 10జీబీ డేటా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి