ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో రకాల పంటలు పండుతున్నాయి. భారతదేశంలో పండించిన పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ మిర్చి సహా ఇంకా ఎన్నో రకాల వంటలు పుష్కలంగా పండుతూ ఉండటంతో ఇక ఆయా పంటలను ఎన్నో దేశాలకు పంపించటం చేస్తూ ఉన్నాం. ఇలా భారత్ నుంచి ఎగుమతి చేసే పండ్లలో ముఖ్యంగా మిర్చి ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపుగా దేశవ్యాప్తంగా మిర్చి పంట పండుతోంది. ఎన్నో ప్రాంతాలలో రైతులు మిర్చి పంట వేసి ఎగుమతి చేసి భారీగా డబ్బులు ఆదాయాన్ని సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.


 ఇకపోతే ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మిర్చి అనేది ఒక భాగంగా మారిపోయింది. ఎందుకంటే మిర్చి వాడకుండా ఏ వంటకాన్ని చేయలేరు. ప్రతి వంటకంలో తప్పనిసరిగా టేస్టు రావడానికి  మిర్చి వేస్తూ ఉంటారు. ఇలా సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా మిర్చి వాడకం మాత్రం  చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మిర్చి ఎగుమతుల్లో కూడా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోనే  టాప్ లో కొనసాగుతోంది భారత్. ఇక భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎప్పుడు భారీగా ఎగుమతులు అవుతూ ఉంటాయి. కానీ అసలు విషయం ఏమిటంటే అసలు మిర్చి భారత దేశానికి చెందినది కాదట.


 భారతదేశాన్ని కనుగొన్న శాస్త్రవేత్త వాస్కోడిగామా అప్పట్లో మిర్చిని భారత్కు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. 1498లో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వాస్కోడిగామా మిరపకాయలు వెంట తీసుకున్నాడట. ఆ తర్వాత ఈ రుచి క్రమక్రమంగా దేశవ్యాప్తంగా పాకిపోయింది అన్నది అర్ధమవుతుంది.  మిర్చి పరిచయం లేక ముందు భారతదేశంలో ఎక్కువగా కారం కోసం నల్ల మిరియాలను వాడేవారట. ఇక ఆ తర్వాత కాలంలో పరిస్థితులు మారిపోయాయి. మిర్చి వాడకం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా అందరూ వాడటం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మిర్చి ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచింది. భారత్ నుంచి అమెరికా, నేపాల్, శ్రీలంక,యూకె ఇలాంటి దేశాలు ప్రస్తుతం ఎగుమతి చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: