పొత్తులపై స్పందించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయపడుతున్నారా ? వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. పవన్ తో పొత్తుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ బహారంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తు ప్రతిపాదనను చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా పవన్ మాత్రం దానిపై ఏమీ మాట్లాడటం లేదు. పార్టీ నేతల్లో ఇదే విషయమై చర్చ జరుగుతున్నా ఎవరి మైండ్ గేమ్ లోను పడద్దని పవన్ ఇచ్చిన వార్నింగ్ అందరికీ తెలిసిందే.
చంద్రబాబు బహిరంగంగా లవ్ ప్రజోజల్ చేసినా పవన్ ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకంటే భయపడుతున్నారట. చంద్రబాబు పొత్తు ప్రపోజల్ ను తిరస్కరించటం పవన్ ఏమాత్రం ఇష్టంలేదట. అలాగని బహిరంగంగా ఆమోదించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలేనట. చాలా కాలంగా బీజేపీతో పొత్తుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించటంలేదు. చివరకు విసిగిపోయిన చంద్రబాబు అదే ప్రజోజల్ ను పవన్ ముందుంచారు.
ఇపుడుగనుక చంద్రబాబు లవ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తే చాలా ఇబ్బందులొస్తాయని ఆలోచిస్తున్నారట. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున తాను ఏకపక్షంగా చంద్రబాబుతో పొత్తుకు రెడీ అయ్యేందుకు లేదు. ఇప్పటికిప్పుడు ఓకే చెప్పాలంటే బీజేపీతో పొత్తు కట్ చేసుకోవాలి. అదే జరిగితే వెంటనే తనతో పాటు చంద్రబాబు మీద కూడా కేంద్రంలోని పెద్దలు టార్గెట్ చేసే అవకాశముందని పవన్ భయపడుతున్నారట. తనను కాదని బయటకు వెళ్ళిన వాళ్ళపై కేసులతో బీజేపీ ఎలా వెంటాడుతోందో యూపీలో కనిపిస్తోంది.

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళునపుడు ఇప్పటినుండే బీజేపీతో కంపవ్వటం ఎందుకనే ఉద్దేశ్యంతోనే పవన్ వెనకాడుతున్నట్లు సమాచారం. నిజానికి బీజేపీతో పొత్తువల్ల జనసేనకు వచ్చే లాభమేమీ లేదు నష్టం తప్ప. అదే చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే కొన్ని ఓట్లయినా వస్తాయి. ఎన్నికలు దగ్గరపడేంత వరకు వెయిట్ చేస్తే పరిస్ధితుల్లో మార్పువచ్చి బీజేపీ కూడా చంద్రబాబుతో పొత్తుకు రెడీ అయ్యే అవకాశాలున్నాయని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లోపు అదే జరిగితే పవన్ కన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకోరుండరు. ఒకవేళ జరగకపోతే అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని పవన్ అనుకుంటున్నారట. పవన్ ఆలోచనలో కూడా కొంత లాజిక్ ఉంది. చూద్దాం ఎన్నికల వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: