ఇక కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో ఒకే ఒక్క నాయకుడి కారణం వల్ల ఇప్పుడు బీజేపీ పార్టీ బాగా ఆపశోపాలు పడుతోంది. అందువల్ల నాయకులు బాగా కలకలం చెందుతున్నారు.ఇక దీనికి కారణం ఏంటంటే.. కులాల సమీకరణలు అని చెప్పాలి. అతని వల్ల అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇక విషయంలోకి వెళ్తే.. యూపీలో కేవలం యాదవులే కాక కుర్మీ మౌర్య కుశ్వాహా సైనీ రాజ్భర్ లాంటి వెనుకబడిన వర్గాల ఓట్లు అనేవి చాలా కీలకం. గత ఎన్నికల ముందు వరకు కూడా యాదవేతర ఓబీసీలు మాజీ సీఎం అయిన బీఎస్పీ నాయకురాలు మాయావతికి మరో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు సపోర్ట్ ఇచ్చేవారు. అఖిలేశ్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కూడా యాదవ్-ముస్లిం ఓట్లే తనకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించడం జరిగింది. దాని ఫలితంగానే యాదవేతర ఓబీసీలు కూడా దూరమయ్యారు.ఇక అటు మాయావతి కూడా బలహీనపడిపోవడంతో ఆనాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చక్రం తిప్పి.. యాదవేతర ఓబీసీ నేతలందరినీ బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చారు.

ఇక వీరిలో ఈ మధ్య యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి తప్పుకున్న సీనియర్ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య ముఖ్యుడు. ఈయనకు మౌర్య వర్గంలో మంచి పలుకుబడి అనేది ఉంది. అమిత్షా పిలుపు వల్ల బీజేపీ పార్టీలో చేరిన ఈయన యోగి కేబినెట్లో కార్మిక మంత్రిగా పనిచేశారు. అయితే.. యోగి వల్ల ఆయన తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఈయన సారథ్యంలోనే మిగతా ఓబీసీ నేతలు కూడబలుక్కుని బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పి అఖిలేశ్ తో చేరుతున్నట్లు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. వీరంతా యోగి వ్యవహార శైలిపై ఎంతో అసంతృప్తితో ఉన్నారు.ఇక వీరితోపాటు న్యాయ మంత్రి దారాసింగ్ చౌహాన్ మరో ఓబీసీ కీలక నేత ఆయుష్ శాఖ మంత్రి ధరం సింగ్ సైనీ కూడా రిజైన్ చేయడంతో వరుసగా యోగి కేబినెట్ నుంచి మూడవ మంత్రి తప్పుకొన్నట్లయింది. ఈ ముగ్గురితో పాటు మొత్తంగా ఇప్పటికి మొత్తం 13 మంది బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి యోగి ఏకపక్ష వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకే బాగా ఇబ్బందిగా మారింది. ఆయనతో విభేదాల వల్ల మిత్రపక్షం నేత సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీస్పీ) నేత ఓంప్రకాశ్ రాజ్భర్ కేబినెట్ నుంచి ఇంకా ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. ఇక తాజా ఎన్నికల్లో అఖిలేశ్ తో ఆయన పొత్తు పెట్టుకున్నారు.ఇక ఈ నేపథ్యంలో ఇతర ఓబీసీ మంత్రులు కూడా యోగి నీడ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మాయావతి ప్రధాన టీమ్ లో ముఖ్యమైన పాత్ర పోషించి బీఎస్పీ ప్రాభవానికి కారకుడయ్యారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

2017లో బీజేపీ ఘన విజయంలోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.ఇక తూర్పు యూపీలోని కుషినగర్ జిల్లాకు చెందినటువంటి స్వామి ప్రసాద్ ప్రభావం రాయ్బరేలీ ఊంచాహార్ షాజహాన్ పూర్ బదయూన్ జిల్లాలలో కూడా ఉందని అంచనా. ఇక మొత్తం జనాభాలో 8 శాతం ఉన్న మౌర్యులు రాష్ట్రంలోని ఓబీసీల్లో యాదవులు కుర్మీల తర్వాత ఎక్కువ శాతం ఉన్నారు. వీరు ఇప్పుడు బీజేపీ పార్టీకి  ఖచ్చితంగా దూరం కావడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp