డ‌బ్బుల‌న్నీ పంచుకుంటూ వెళ్తూ అస్స‌లు జ‌నం ఎలా ఆలోచించాలో ఎందుకు ఆలోచించాలో కూడా తెలియ‌నివ్వ‌కుండా పాల‌న  చేయ‌డంలో అర్థ‌మే లేద‌ని ఆర్థిక నిపుణులు నెత్తీ నోరూ మోదుకుంటున్నారు.అయినా కూడా మ‌న పాల‌కులకు ఇవి ప‌ట్ట‌వు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వ‌ద్ద‌నే అంటుంది.అయినా ఓటు బ్యాంకు రాజ‌కీయం మాత్రం ఇందుకు ఒప్పుకోదు. న‌గ‌దు బ‌దిలీలతో రికార్డు స్థాయి డ‌బ్బుల పంప‌కంతో సాధించిందేంటో! ఇది విష‌య‌మై ఉప రాష్ట్ర‌ప‌తి కూడా అభ్యంత‌రాలే చెబుతున్నారు.


పార్టీలు తాత్కాలిక జ‌నాకర్ష‌ణ ప‌థ‌కాల‌ను వీడితేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అంటున్నారు.అయినా ఈ మాట‌ల‌ను ఏపీ సీఎం వినిపించుకుంటారా? ఒక‌వేళ వినిపించుకున్నా వాటిని పాటిస్తారా? ఏమీ ఉండ‌వు..తెలుగు రాష్ట్రాల‌లో అత్య‌ధికంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న రాష్ట్రం ఏపీనే! ఆ మాట‌కు వ‌స్తే దేశంలోనే ఇన్ని ఉచిత ప‌థ‌కాలు ఎక్క‌డా ఏ రాష్ట్రంలోనూ లేవు. పింఛ‌ను కూడా గ‌రిష్టంగా చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీనే!



పింఛ‌ను వ‌ర‌కూ ప‌ర్లేదు కానీ ఇంకా ఎన్నో ఉచితాల‌కు ప్ర‌జ‌లను అల‌వాటు చేసి వారికి ఆర్థిక స్వావ‌లంబ‌న ద‌క్క‌కుండా, ప‌రోక్షంగానో ప‌రోక్షంగానో వారి అభివృద్ధికి విఘాతం క‌లిగిస్తున్న తీరుపై, అందుకు కార‌ణం అవుతున్న యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సెటైర్లు వేశారు. ఉచితాల కార‌ణంగా మంచి ప్ర‌భుత్వాలు అనిపించుకోవు అని ప‌రోక్షంగానే జ‌గ‌న్ ను ఉద్దేశించి కామెంట్లు పాస్ చేశారు.దీంతో వెంక‌య్య మాట‌లు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి.



ఉచితంగా ఇవ్వ‌డం ఎంత వ‌రకూ ఉచితం..ప్ర‌జ‌ల‌కు బత‌క‌డం నేర్పాలి అంటూ ఆయ‌న నిన్న‌టి వేళ కొన్ని ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.ఇవే ఇప్పుడు వైసీపీలో అంత‌ర్మ‌థ‌నానికి కార‌ణం అవుతున్నాయి.రాష్ట్రంలో సంక్షేమానికే రెండున్న‌రేళ్ల‌లో ల‌క్ష కోట్ల‌కు పైగా వెచ్చించామ‌ని చెబుతున్న స‌ర్కారు,ఇక అభివృద్ధి ఎలా చేస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో బీజేపీ వ‌ర్గాలు సీఎం జ‌గ‌న్ తీరును ప్ర‌శ్నిస్తూ ఉన్నాయి.అయిన‌ప్ప‌టికీ ఇప్పుడున్న ప‌రిణామాలు అంత వేగంగా మారిపోతాయి అని, ఇప్పుడున్న నిర్ణ‌యాలు అంత వేగంగా మారిపోతాయి అని చెప్పలేం. ఎవ‌రు ఎన్ని చెప్పినా తానేం అనుకున్నానో అదే చేస్తాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న సీఎం జ‌గ‌న్ కు ఉచిత ప‌థ‌కాలు అంటేనే ఎంతో ఇష్టం. ప‌థ‌కాల పేరిట న‌గ‌దు బ‌దిలీ అంటే ఎంతో ఇష్టం..అని ఎప్పుడో తేలిపోయింది.కేవ‌లం వీటి కార‌ణంగానే అభివృద్ధి ఆగిపోయినా, సంబంధిత ప‌నులు ముందుకు క‌ద‌ల‌క‌పోయినా అస్స‌లు ప‌ట్టించుకునేందుకే ఇష్ట‌ప‌డ‌డం లేదు జ‌గ‌న్.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp