డ్రగ్స్ కేసు కోర్టు సంచలన తీర్పు ?

డ్రగ్స్ కేసు కోర్టు లో వాదనలు పూర్తి ..ఈరోజు నిందుతుల కస్టడీ పై తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు సంచారం అందుతోంది. ప్రధాన నిందితుడు టోనీ తో 34 మంది వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే డ్రగ్స్ వాడిన 7 మంది వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.
డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించారు పోలీసులు.. టోనీ తో పాటు 9 మంది నిందితులను 7 రోజులు పాటు కస్టడీకి కోరిన పోలీసులు
నిందితులను కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుంది అంటున్నారు పోలీసులు..పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  టోనీ దగ్గర నుండి కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారు వ్యాపారవేత్తలు..


వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేశారు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ.. లావాదేవీలన్నీ డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు గుర్తించారు టాస్క్ ఫోర్స్  పోలీసులు.. తన సెల్ ఫోన్ లో ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకున్నారు టోనీ..  టాస్క్ ఫోర్స్  పోలీసులు టోనీ కి సంబంధించిన రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందుతోంది.  సెల్ ఫోన్ ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్ ను రికవరీ చేశారు  టాస్క్ ఫోర్స్  పోలీసులు.. టోనీ సెల్ ఫోన్ లో మరి కొంత మంది వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు  టాస్క్ ఫోర్స్  పోలీసులు.. మొత్తం 34 మంది ని గుర్తించిన పోలీసులు..ఇందులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు  టాస్క్ ఫోర్స్  పోలీసులు..ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పేరు విన పడకూడదని నిన్న ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. డ్రగ్స్ నిర్వాహకుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని అసలు రాష్ట్రంలో ఆ మాటే వినపడగా కూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: