ఒమిక్రాన్ భయాలతో ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాలు స్థానికంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల స్కూళ్లు ప్రారంభం కాలేదు, మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియోతో అన్నీ నడుస్తున్నాయి. ఈ దశలో కర్నాటకలో మాత్రం అన్నిటిపై ఆంక్షలు లేకుండా చేశారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
కర్నాటకలో కొవిడ్ రూల్స్ అన్నీ తీసేశారు. జిమ్ లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్టీ హాల్స్.. లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు సీఎం. అక్కడ దాదాపుగా కరోనాకి ముందు పరిస్థితులు తిరిగి వచ్చేశాయి. ప్రస్తుతం కర్నాటకలో అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే లోగా.. కర్నాటకలో వ్యాపార కార్యకలాపాలన్నీ సాఫీగా నడిచేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
కర్నాటక బాటలో తమిళనాడు..
దక్షిణాదిలో కర్నాటక తర్వాత ఆంక్షలను అంతే త్వరగా తొలగిస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఏపీ, తెలంగాణ కూడా కాస్త వెనకా ముందూ ఆలోచిస్తున్న సమయంలో తమిళనాడు మాత్రం ఆంక్షలను తొలగించుకుంటూ పోతోంది. కర్నాటక తరహాలో ఒకదాని తర్వాత మరొకటి.. ఇలా ఆంక్షల్ని పక్కనపెడుతోంది. తమిళనాడులో సోమవారం నుంచి లేదా బుధవారం నుంచి ఆంక్షలన్నీ తొలగించేస్తారు. వందశాతం ఆక్యుపెన్సీ రేషియోని అమలులోకి తెస్తారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది. స్కూల్స్, సినిమా థియేటర్ల విషయంలో వందశాతం ఆక్యుపెన్సీ రేషియోని అమలులోకి తెస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి