ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధర మరియు ఇతర ప్రముఖ సినీ అంశాలపై మాట్లాడటానికి మరోసారి ఏపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలవబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో అక్టోబర్ నెలలో ఒకసారి ఇదే విషయం మీద సిఎం జగన్ గారిని చిరంజీవి దంపతులు కలిసిన విషయం తెలిసిందే. అప్పట్లో చిరు రాజకీయ విషయం అయి సిఎం ను కలిశారని పలు వార్తలు వెల్లువెత్తాయి. అందుకు స్పందించిన చిరు తను సినీ పరిశ్రమ బిడ్డగానే జగన్ గారిని కలిశాం తప్ప రాజకీయ పరంగా కాదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇపుడు మరో సారి తన సినీ బృందంతో కలిసి ఏపి ముఖ్యమంత్రిని కలవడానికి చిరు సిద్దమైనట్లు సమాచారం.

అయితే ఈ సమావేశంలో ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యాంశాలను చర్చించడానికి , సిఎం వద్దకు కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లడానికి ఇపుడు చిరు సిఎంతో సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారట. సతీ సమేతంగా అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి అపుడు జగన్ గారిని కలిశారు. అప్పట్లో సినీ పరిశ్రమకు చెందిన సమస్యలు వివరించగా సిఎం చాలా సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని అంతా వింటారని ఆయన చెప్పినట్లు చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా తరువాత తన సినీ టీం తో మరోసారి సిఎం ను కలుస్తారని చెప్పుకొచ్చారు. కాగా ఇపుడు అందుకు అన్ని సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ చిరంజీవి మరియు ఇంకొందరు సినీ దిగ్గజాలు కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో వీళ్ళు చర్చించదలిచే పాయింట్స్ ఒకసారి చూస్తే,

* గత కొంత కాలంగా సినిమా పరిశ్రమ ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీ థియేటర్ టికెట్ల ధరల పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

* ఇండస్ట్రీకి సంబంధించిన ప్రభుత్వం వైపు నుండి అందాల్సిన వనరులు, సహాయ సహకారాలు వంటివి మేజర్ పాయింట్స్ అని తెలుస్తోంది.

మరి చివరగా ఏమి జరగనుంది అనేది తెలియల్న్ట్ ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: