దీనికి తగినట్లుగానే ఇజ్రాయెల్ లో మరొక కరోనా వేరియంట్ ను గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ లోని బెన్ గురియోన్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఇద్దరు ప్రయాణికులలో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారట. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ వేరియంట్ ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్ లను గుర్తించారు. అంతే కాకుండా వీటిని BA. 1, BA. 2 లుగా నామకరణం చేశారు. అయితే ఈ వేరియంట్ సోకిన ఇద్దరి వ్యక్తులలో జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి సాధారణమైన లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వైద్య అధికారులు తెలియచేశారు.
ఇంతకు ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధంగా త్వరలోనే భారత్ లో కరోనా తన పంజాను మరోసారి విసరనుందని తెలుస్తోంది. ఇప్పటికే చైనా లో మళ్లీ కరోనా విజృంభించి లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జనవరి ఆ ప్రాంతంలో BA. 2 పేరుతో కరోనా థర్డ్ వేవ్ పేరిట వచ్చి, అయితే ఇప్పటికీ ఆ ప్రభావం దేశంలో ఉందని తెలుస్తోంది. దీనికి కొనసాగింపుగా ఫోర్త్ వేవ్ వస్తుందని వైద్య అధికారులు భావిస్తున్నారు. ఈ వరినాత్ వస్తే 75 శాతం ప్రజలకు సోకనుందని తెలుస్తోంది. మరి ఈ వేరియంట్ అటు చైనా నుండి కానీ లేదా ఇజ్రాయెల్ దేశం నుండి కానీ వచ్చే అవకాశం ఉంది. ఇకపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరి ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి