ఎమ్మెల్యే పదవిని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక గూడెం మహిపాల్ రెడ్డి పాల్పడుతున్న అక్రమాలను ఆపక పోతే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఈ క్రమం లోనే ఇదే విషయం పై స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనపై వస్తున్న విమర్శలపై గరంగరం అయ్యారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గతాన్ని మరిచి పోయి నీతులు మాట్లాడుతున్నారు.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ మీరు.. మీరు రంగులు మార్చడం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది అభివృద్ధి చూసి ఓర్చు కోలేకనే అనవసర రాద్ధాంతం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.. ఒకవేళ మీరు చెప్పినట్లు గా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కనీసం ఒక గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏకంగా పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధమే అంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు సవాల్ విసిరారు గూడెం మహిపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సవాల్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలా స్పందించపోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి