కరోనా వైరస్ తో రెండేళ్లు పాటు యుద్ధం చేసిన జనం ఇపుడిపుడే ఆ మహమ్మారి నుండి బయటపడుతున్నారు. అంతేనా ఈ మధ్య మళ్ళీ పలు వేరియంట్లు ప్రజల్లో మళ్ళీ కలకలం రేపాయి. అయితే ఇవన్నీ చాలవు అన్నట్టు ఇపుడు వినిపిస్తున్న మరో వార్త మరో కొత్త భయాన్ని రేకెత్తిస్తోంది. అదే మంకీ పాక్స్ గతంలో ఈ వైరస్ గురించి వినే ఉంటారు. అయితే ఇపుడు గత కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని వార్తలు వినపడుతున్నాయి.

మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు  27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు మాత్రమే నిర్దారణ కాగా ఆ తరవాత కేవలం కొద్దీ రోజుల్లోనే ఆ నంబర్ మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 3 తరవాత నుండి ఈ నెల 2 వరకు 780 కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ. ఈ మధ్య కాలంలోనే ఈ వైరస్ వేగం బాగా పెరిగిందని. ప్రపంచ దేశాలు అలెర్ట్ గా ఉండవలసిన అవసరం ఉందని తెలియచేసింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి కి సంబందించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు సంభవించడం దుదృష్టకరం. కాగా దేశంలో మంకీపాక్స్‌ గతంలో వైరస్ ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ  మంకీపాక్స్‌ వైరస్  లక్షణాలు  పలువురిలో కనపడుతున్నాయి అని సమాచారం.

యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడటం గమనార్హం. ఆ చిన్నారి శరీరంపై పెద్ద పెద్ద దద్దర్లు వచ్చి దురద ఉన్నట్టు తెలుపగా పరీక్షించిన వైద్యులు అవి మంకీ పాక్స్ లక్షణాలు అని గుర్తించారు. దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. అలాగే ఆ చిన్నారికి వైరస్ ఎలా సోకి ఉండొచ్చు అనే ప్రాథమిక దర్యాప్తు జరిగుతున్నట్లు తెలిపారు.

అయితే బాధితురాలి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు క్లారిటీ ఇవ్వడం తో అసలు ఆ చిన్నారికి వైరస్ ఎలా సోకి ఉంటుంది అన్న దాని పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్‌ అయ్యి దేశం లో మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రజలు అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తో ఆందోళన కూడా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: