హిస్టరీ రిపీట్స్ అని అంటుంటారు పెద్దలు. ఏమిటంటే అప్పుడెప్పుడో జరిగింది మళ్ళీ ఇంతకాలానికి అలాగే జరుగుతోందని చెప్పటానికే హిస్టరీ రిపీట్స్ అని చెబుతుంటారు.  అప్పుడెప్పుడో అంటే 2009 ఎన్నికల్లో  ప్రజారాజ్యంపార్టి విషయంలో జరిగిన వ్యవహారమే మళ్ళీ రేపటి ఎన్నికల్లో జరగబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతిలో తాను పోటీచేస్తే ఎలాగుంటుందో తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సర్వే చేయించారట. ప్రత్యేకంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎందుకు సర్వే చేయించారు ? ఎందుకంటే రెండు కారణాలున్నాయి. మొదటిదేమో తన అన్నయ్య చిరంజీవి తిరుపతి నుండి పోటీచేసి గెలవటం. ఇక రెండో కారణం ఏమిటంటే పవన్ ఇక్కడినుండి పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని పార్టీ నేతలు తీర్మానం చేసి పంపటం.

రెండో కారణంలో నిజమెంతో తెలుసుకుందామని పవన్ సర్వేచేయిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. అదేమిటంటే జనసేనకు ఓట్లేస్తామని బలిజ(కాపు)లు తప్ప ఇంకెవరూ చెప్పలేదట. తిరుపతి నియోజవర్గంలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నమాట నిజమే కానీ ఆ ఓట్లతోనే పవన్ గెలవటం సాధ్యంకాదు. అన్నీ సామాజికవర్గాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. మరి జనసేనకు ఎందుకీ పరిస్దితంటే బలిజల ఓవర్ యాక్షనేని తేలిందట. లోకల్ లీడర్ల ఓవర్ యాక్షన్ వల్ల జనసేన అంటే బలిజల పార్టీగానే ముద్రపడిందట.


అందుకనే మిగిలిన సామాజికవర్గాల వాళ్ళు జనసేనకు ఓట్లేయమని చెప్పారట. అప్పట్లో ప్రజారాజ్యపార్టీ విషయంలో కూడా అచ్చంగా ఇలాగే జరిగింది. చిరంజీవి పార్టీఅంటే ఇది కాపుల కోసమే పెట్టిన పార్టీ అన్నట్లుగా చాలామంది నేతలు రెచ్చిపోయారు. దాంతో అందరివాడు అనిపించుకోవాల్సిన చిరంజీవి చివరకు కొందరివాడుగా మిగిలిపోయారు. దాంతో ఊహించని దెబ్బపడిపోయింది. ఇపుడు తాజా సర్వే చూస్తే ఈ పద్దతి తిరుపతిలో మాత్రమే ఉందా లేకపోతే రాష్ట్రమంతా ఇలాగే ఉందా అన్న టెన్షన్ పెరిగిపోతోందట. తిరుపతి పరిస్దితే రాష్ట్రమంతా ఉంటేగనుక పవన్ ఎక్కడ పోటీచేసినా గెలుపు అనుమానమే. అలాగే జనసేనకు సీట్లు రావటమూ కష్టమే. చివరకు జనసేన కూడా మరో ప్రజారాజ్యంపార్టీ అయిపోతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: