వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అంటు తెల్లారిలేస్తే రెండుపార్టీల నేతలు ఒకటే ఊదరగొట్టేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మహాఅయితే ఓ 15 సీట్లు వస్తాయంతే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం కూడా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే విషయాన్ని పక్కనపెట్టేద్దాం. అలాగే మిత్రపక్షాలు లేదా జనసేన-బీజేపీ విడివిడిగా పోటీచేసినా ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని కూడా ఇపుడే చెప్పలేం.
ఈ నేపధ్యంలోనే మిత్రపక్షాలకు ఉన్న సామర్ధ్యం ఏమిటనే విషయం ఒకటి బయటపడింది. అదేమిటంటే ఈనెల 20వ తేదీన తిరుపతి టౌన్ బ్యాంకు డైరెక్టర్ పోస్టులకు ఎన్నిక జరగబోతోంది. 12 మంది డైరెక్టర్లు కలిసి తర్వాత ఛైర్మన్ను ఎన్నుకుంటారు. దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్న బ్యాంకు కాబట్టి ఎన్నికలు చాలా ప్రిస్టేజియస్ గా జరుగుతుంది. ఎన్నికలన్నాక కచ్చితంగా రాజకీయపార్టీలు ఎంటరవ్వాల్సిందే కదా.
ఇదే పద్దతిలో వైసీపీ, టీడీపీ మద్దతుదారులే డైరెక్టర్లుగా పోటీచేస్తున్నారు. ఇదే సమయంలో 12 డైరెక్టర్ పోస్టులకు గాను బీజేపీ తరపున ఒకళ్ళు పోటీచేస్తున్నారు. జనసేన నుండి అయితే కనీసం ఒక్కళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. టౌన్ బ్యాంకు ఎన్నికల్లో 57 వేల ఓట్లున్నాయి. అంటే తిరుపతి నియోజకవర్గంలో 2.4 లక్షల ఓట్లుంటే టౌన్ బ్యాంకు ఎన్నికల్లో 57 వేల ఓట్లుండటమంటే మామూలు విషయంకాదు.
మరింత ప్రిస్టేజియస్ గా జరిగే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు ఎందుకు దూరంగా ఉంటున్నట్లు ? మొన్ననే తిరుపతి నుండి పవన్ పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటి చూపిస్తామని తిరుపతి జనసేన నేతలు ఏకంగా పవన్ కే చెప్పారు. నిజంగానే పార్టీకి అంతటి సత్తా ఉంటే ఇపుడు బ్యాంకు ఎన్నికల్లో కనీసం ఒక్క నేతకూడా ఎందుకు పోటీచేయటంలేదు ? బీజేపీ, జనసేన పార్టీల్లో సమస్య ఏమిటంటే రెండుపార్టీల్లోని నేతలు మీడియా సమావేశాల్లోను, విమానాశ్రయంలో రిసీవింగ్, సెండాఫ్ కు మాత్రమే పనికొస్తారు. అంతేకానీ పట్టుమని వందఓట్లున్న నేతలు ఒక్కళ్ళు కూడా లేరని తేలిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి