తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కొన్ని రాష్ట్రాలను తమ స్వార్ధం కోసం ఇతర పార్టీలలోని ఎమ్మెల్యేలను కొనేసి అక్కడ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించడం చాలా విమర్శలకు దారి తీసింది. అయినా బీజేపీ హై కమాండ్ ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కాగా వారికి చాలా కాలంగా అందని ద్రాక్షలా ఉన్న దక్షిణ రాష్ట్రాలలో అధికారంలోకి రావడం పైనే వారి దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చారు. అలా గత రెండు సంవత్సరాలకు ముందు కర్ణాటకలో దొడ్డిదారిలో కాంగ్రెస్ ఆర్జేడీ ఎమ్మెల్యేలను కొనేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక మిగిలిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నా వారి తరం కావడం లేదు. అయితే నిన్న తెలంగాణ లో జరిగిన మునుగోడు సభలో దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం ప్రజల్లోనూ మరియు బీజేపీ నాయకులలోనూ కలిగింది. అమిత్ షా నిన్న సభలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణాలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అనడంతో అందరూ ఆశ్చర్యచకితులు అయి ఉంటారు.

అదేంటి.. దేశ హోమ్ మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ఒక ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనడం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు చేస్తున్నారు. కాగా బీజేపీ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు క్లియర్ గా అర్ధం అవుతోంది. లేకుంటే... అంత పెద్ద సభలో అమిత్ షా అలా ఎందుకు మాట్లాడుతాడు అంటూ రాజకీయ ప్రముఖులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ రానున్న అతి తక్కువ రోజుల్లో తెరాస నుండి పెద్ద సంఖ్యలో జంపింగ్ లు బీజేపీలోకి ఉంటాయని అంత అనుకుంటున్నారు. త్వరలోనే అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఆకర్ష్ స్టార్ట్ అవుతుందనడానికి నిన్న సభ సాక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సభను ఫాలో అయిన కేసీఆర్ గుండెల్లో భయం స్టార్ట్ అయి ఉంటుందా ?  మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: