ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని హ్యాట్రిక్  కొట్టాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. అయితే కనీసం ఈసారైనా ఇక కేంద్రంలో ఎన్డీఏని గద్దె దింపి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తుంది. ఎవరికివారు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాలలో సత్తా చాటడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలో దింపారు. ఇక ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు ప్రచార భరిలో దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈసారి ఇక తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బలిలోకి దింపింది. కాగా తెలంగాణ మాజీ బిజెపి అధ్యక్షుడు కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేవలం తన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేయడమే కాదు.. ఇక రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ తరపున నిలబడిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కాగా ఇటీవలే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 ఈసారి ఐపీఎల్ కప్ తమదే అంటూ కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఐపిఎల్ అనగానే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనుకునేరు. బండి సంజయ్ ఉద్దేశం ప్రకారం ఇండియన్ పొలిటికల్ లీగ్ లో ఈసారి విజయం తమదే అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇక టిపిఎల్ కూడా తమదే  అంటూ చెప్పుకొచ్చారు. టిపిఎల్ అంటే తెలంగాణ ప్రీమియర్ లీగ్. కాంగ్రెస్కు ప్లేయర్స్ కూడా ప్రస్తుతం దొరకడం లేదని.. ఇక బిఆర్ఎస్ కు ఆటగాళ్లు ఉన్న ప్రస్తుతం ఫామ్ లో లేరు   అయితే ప్రస్తుతం బిజెపి కిషన్ రెడ్డి కెప్టెన్సీలో దూసుకుపోతుంది. టిపీఎల్లో 17 సీట్లు గెలుచుకుని టైటిల్ విజేతగా నిలుస్తుంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: