ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మరొకసారి టిడిపిలో చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా కూటమిలో భాగంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇప్పటికీ టిడిపి బిజెపి మధ్య సీట్ల విషయంలో తర్జనభజన జరుగుతూనే ఉంది. చంద్రబాబు చాలామంది నేతలకు బీఫామ్ కూడా అందించారు.. ముఖ్యంగా కొంతమంది నేతలను కూడా నియోజవర్గాలుగా మార్చడం జరిగింది. దీంతో కూటమిలో ఒక వార్ మొదలైనట్టుగా కనిపిస్తోంది.. ఇప్పుడు తాజాగా రాయలసీమలోని మడకశిర ప్రాంతంలో చంద్రబాబు ఫోటోలు టిడిపి కార్యకర్తలు సైతం చెప్పులతో కొడుతున్నారు.


అసలు విషయంలోకి వెళ్తే శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ప్రాంతంలో టిడిపిలో ఒక్కసారిగా అసంతృప్తులు బగ్గుమంటున్నాయి.. ముఖ్యంగా టిడిపి అభ్యర్థి సునీల్ ను ఇక్కడ మార్చి ఎమ్మెస్ రాజుకు సీటు ఇవ్వడంతో టిడిపి అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన పలువురు టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న అతని వర్గీయులు సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. మడకశిర లో ఉండేటువంటి టిడిపి కార్యాలయం వద్ద ఆయన వర్గీయులతో ఆందోళనకు దిగినట్టుగా సమాచారం.


అంతేకాకుండా టిడిపి సీటు మార్చడంతో అక్కడ టిడిపి ఫ్లెక్సీలను చింపేయడమే కాకుండా దహనం చేస్తున్నారు.. మరి కొంతమంది నేతలు కార్యకర్తలు కూడా చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పరంటూ నాన హంగమా చేస్తున్నారు. అక్కడ సీటు ఇచ్చినటువంటి ఎమ్మెస్ రాజు గో బ్యాక్ అంటూ పలు రకాల నినాదాలతో టిడిపి కార్యకర్తలు సైతం రచ్చ లేపుతున్నారు.. ఇప్పుడు రాయలసీమలో మడకశిర నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారుతోంది.. మరి ఈ విషయం పైన అభ్యర్థి సునీల్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


ఇప్పటికే మరి కొన్ని చోట్ల కూడా సీట్లు మార్చే పరిస్థితి ఏర్పడినట్లు కూటమిలో కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల టిడిపి పార్టీకి చాలా దెబ్బ పడేలా కనిపిస్తోందంటూ పలువురు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: