ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ లకు సైతం సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం పైన ఎక్కువగా దుమారం  రేపేలా చేస్తున్నారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్. ముఖ్యంగా సీఎం జగన్ పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని భూములన్ని కూడా సీఎం జగన్ లాక్కుంటున్నారంటూ అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు ఈ విషయం పైన పలువురు వైసిపి నేతలు సాక్షాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది.


దీనిపైన ఈసీ కూడా చర్యలు చేపట్టాలని సిబిఐడి కి ఆదేశాలను జారీ చేసింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం పైన ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో వారందరి పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోని చంద్రబాబు నాయుడు A-1, ఆయన కుమారుడు లోకేష్ A-2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. వీరందరితో పాటు ఐవిఆర్ఎస్ ద్వారా ప్రమోషన్ చేస్తున్నటువంటి ఏజెన్సీల పైన కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరందరితోపాటు 8 మంది పైన కేసులు నమోదయ్యాయి



వీటి పైన ఇప్పటివరకు టిడిపి స్పందించకపోవడంతో పాటుగా హాజరు కూడా కాకపోవడంతో నోటీసులు మరొకసారి పంపించింది సిఐడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నీతి అయోగ్ తయారుచేసినటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా పంపిందని దేశంలో ఉన్న భూవివాదాలను సైతం తగ్గించాలని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని.. ఆంధ్రాలో ల్యాండ్ టైటిలింగ్ ముందే ఈ భూ సర్వే జరపాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరడం జరిగింది.. ముఖ్యంగా ఏవైనా తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తాయని వాటిని పరీక్షరించేందుకు కూడా ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలను కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేశామని ప్రభుత్వం తెలుపుతోంది..అందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి తెలియజేశారు. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తున్నప్పుడు తిప్పికొట్టేందుకు సీఎం జగన్ తన ప్రచారంలో వ్యాఖ్యలు చేశారని కూడా తెలిపారు. వీటివల్ల ఎలాంటి వివాదాలు ఉండవని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని కూడా తెలియజేశారు. ఈ సర్వే పూర్తి అయ్యాక భూములపైన ఎలాంటి వివాదం ఉండదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: