- ఏలూరి లో క‌ష్ట‌ప‌డ‌తే త‌త్వం గుర్తించి ఎంక‌రేజ్ చేసిన బాబు
- అధినేత ఆశ‌లు రెట్టింపు చేస్తూ రెండుసార్లు గెలిచిన సాంబ‌
- ప‌రుచూరును పార్టీ కంచుకోట చేసి బాబుకు ప్రియ‌శిష్యుడిగా గుర్తింపు

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, కష్టపడుతున్నాడు, అసలే పార్టీ రెండుసార్లు ఓడిపోయి కష్టాల్లో ఉంది.. అందులోనూ కీలక నియోజకవర్గం. రాజకీయ అనుభవం లేదు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యత అప్పగిస్తే తట్టుకుని నిలబడతాడా..? అటువైపు కాకలు తీరిన రాజకీయ యోధులు ఉన్నారు. ఈ కుర్రాడు వాళ్లను తట్టుకుంటాడా..? అసలు నియోజకవర్గంలో పార్టీ నిలబడుతుందా..? ఇలా రకరకాల సందేహాల మధ్య 2012 చివ‌రిలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు పరుచూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. అప్పటికే పరుచూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీలో ఉన్న కీలక నేతలు అందరూ వైసీపీ వైపు వెళ్లిపోయారు.


పరుచూరులో టీడీపీ నాయకుడు లేని నావలా మారిపోయింది. చంద్రబాబు సైతం ఎవరికి.. పగ్గాలు ఇవ్వాలా ? అన్న ఆలోచనల్లో ఉన్నారు. ఆ టైంలో ఒకటికి నాలుగు, ఐదు సార్లు ఆలోచన చేసి ఏలూరుకి ఇంచార్జ్ పగ్గాలు అప్పగించారు. ఏడాదిలో ఏలూరి సీను మొత్తం మార్చేశారు. నియోజకవర్గం అంతా పాదయాత్ర చేయడంతో పాటు పరుచూరులో పార్టీని పటిష్టం చేసేందుకు అలుపెరగని శ్రామికుడిలా పోరాటం చేశారు. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చూసి చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు. మొత్తానికి కాస్త పట్టుదల ఉన్న యువకుడు పార్టీకి దొరికాడు కదా అని సంతోషించారు. 2014 ఎన్నికలలో టిక్కెట్ రావడంతో పాటు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏలూరి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు.


ప్రచారంలో కొన్ని పనులు తాను చేయకపోతే 2019 ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అని ఛాలెంజ్ చేశారు ఏలూరి. అన్ని చెప్పినవి చెప్పినట్టుగా చేసి 2019 ఎన్నికలకు వెళ్లారు. అందుకే అంతటి జగన్ ప్రభంజనంలోనూ పరుచూరులో వరుసగా రెండోసారి విజయం సాధించి.. ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తెలుగు గడ్డపై ఏలూరి సాంబశివరావు అంటే ఒక తిరుగులేని యంగ్, క్రేజీ లీడర్ గా మారిపోయారు. తెలుగుదేశం పార్టీకి మరో 20 ఏళ్ల పాటు భవిష్యత్తు ఉన్న నేతగా తిరుగులేని ఆశాకిర‌ణంగా కనిపిస్తున్నారు. చంద్రబాబు సైతం ఏలూరి రెండోసారి గెలిచాక ఇలాంటి నేతలు కదా పార్టీకి కావలసింది అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ అరాచకాలు.. అక్రమాలపై ఏలూరు చేసిన పోరాటం.. చంద్రబాబుకు పిచ్చపిచ్చగా నచ్చింది.


అందుకే బహిరంగ వేదికలలో కూడా ఎన్నోసార్లు ఏలూరిని ఆయన మెచ్చుకున్నారు. ఇలాంటి నేతలే తనకు, పార్టీకి కావాలని చెప్పారు. ఏలూరి, చంద్రబాబుని పార్టీ అధినేతగా కంటే గురువుగా భావిస్తారు. చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ 12 సంవత్సరాలలో ఏనాడూ కూడా తనపై చిన్న రిమార్కు లేకుండా చూసుకున్నారు. అందుకే ఏలూరి అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం. చంద్రబాబు ప్రియ శిష్యులలో ఏలూరి కూడా ఒకరు. ముందు తన దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయా అనుభవం లేదు... సక్సెస్ అవుతాడా.. ? అన్న స్థాయి నుంచి ఈరోజు రాజకీయమంటే కాంట్రవర్సీ లేకుండా ఇంత గొప్పగా చేయవచ్చు అనే ప్రశంసించే వరకు చంద్రబాబుతో ఏలూరి అనుబంధం పెనవేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: