ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిడిపి కార్యకర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మధ్య టిడిపి పార్టీ కార్యకర్త చంద్రయ్య మరణించిన సంగతి తెలిసిందే. టిడిపి కార్యకర్త చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో టిడిపి కార్యకర్త చంద్రయ్య హత్యకు గురయ్యాడని సమాచారం.

 2022 సంవత్సరం లో  వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యకు గురయ్యాడు. రెండు కుటుంబాల మధ్య ఆ కక్ష అని అప్పట్లో పోలీసులు ప్రకటన చేశారు. అయితే వైసిపి కుట్ర ఉందని టిడిపి కూటమి పదేపదే చెబుతూ వస్తోంది. అయితే అలాంటి టిడిపి కార్యకర్త చంద్రయ్య కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని తాజాగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నడిల్లేని కొత్త సంప్రదాయానికి... చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం  తెర లేపింది.

 అలాగే ఏపీ కేబినెట్ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మార్కాపురం జిల్లా సాద్యాలపై చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా మత్తుపూరులో 615 ఎకరాల భూమి పరిశ్రమ పార్కు  ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కి బదిలీ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే రవాణా వాహనాలకు గ్రీన్ టాక్స్ రేట్... నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22 ఏ నిషేధ జాబితాలో ఉన్న ఆస్తుల బదిలీని అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు తో పాటు ఫీజు మినహాయింపునకు కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: