రాజకీయాలలో ఎక్కువ శాతం అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా కొనసాగడానికి అనేక మంది ఇష్టపడుతుంటారు. ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ వ్యక్తులు దాదాపుగా అధికారంలో లేని పార్టీలోకి వెళ్లడానికి అస్సలు ఆసక్తి చూపరు. ఇక అధికారంలో లేని పార్టీ వ్యక్తులు చాలా మంది ఎప్పుడెప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి ఎంట్రీ ఇద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అధికారం లో లేని పార్టీ సభ్యులు అధికారంలో ఉన్న పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.

కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేసే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక అంతకు ముందు అధికారంలో ఉన్న వై సి పి పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకొని ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దానితో ఎలక్షన్ల అనంతరం చాలా మంది వై సి పి పార్టీకి సంబంధించిన వ్యక్తులు టి డి పి , జనసేన , బి జె పి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపించారు.

ఇకపోతే తాజాగా టి డి పి పార్టీకి సంబంధించిన ఓ కార్పొరేటర్ వై సి పి పార్టీలోకి వెళ్లింది. అది టి డి పి పార్టీకి పెద్ద షాక్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు దేశం పార్టీకి సంబంధించిన 41 వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ తాజాగా వై సి పి పార్టీలోకి చేరింది. ఇలా అధికార పార్టీ కార్పొరేటర్ అయి ఉండి కూడా వై సి పి పార్టీలో చేరడంతో టి డి పి పార్టీ సభ్యులు ప్రస్తుతం షాక్ కి గురైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: